Corona Cases: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కేసులు

ABN , First Publish Date - 2023-04-23T10:19:43+05:30 IST

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కేసుల పెరుగుదల ఆందోళనకరంగా ఉంది. కొత్తగా 43 కేసులు నమోదయ్యాయి. ఏలూరు జిల్లాలో 39, పశ్చిమ గోదావరి జిల్లాలో 4 కరోనా కేసులు నమోదయ్యాయి.

Corona Cases: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కేసులు

ఏలూరు జిల్లా: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కేసుల పెరుగుదల ఆందోళనకరంగా ఉంది. కొత్తగా 43 కేసులు నమోదయ్యాయి. ఏలూరు జిల్లాలో 39, పశ్చిమ గోదావరి జిల్లాలో 4 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 135కి చేరింది. పరిగణనలోకి రాని ప్రవేటు ల్యాబుల్లో కరోనా అనధికార టెస్టులు ఉన్నాయి. వాటిని కలిపితే కేసుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.

కాగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు చాపకింద నీరులా పెరుతుగున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం నిన్న దేశవ్యాప్తంగా 12,193 కొత్త కేసులు, 42 మంది కోవిడ్ బారిన పడి మృతిచెందారు. 10,765 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 67,556 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.

రోజువారీ కరోనా కేసులు పెరుగుతుండటంలో ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా గడిచిన వారంలో కరోనా పాజిటివిటీ రేటు పెరిగింది. అంతకుముందు వారం 4.7గా ఉన్న పాజిటివిటీ రేటు గతవారం 5.5శాతానికి పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. అయితే కోవిడ్ సోకిన వారు ఆస్పత్రిలో చేరడం, మరణాల సంఖ్య తక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

కొన్ని రాష్ట్రాలు, జిల్లాల్లో అధికసంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నందున కమ్యూనిటీ వ్యాప్తి పెరిగే అవకాశం ఉంది.కాబట్టి ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అవసరమైన ప్రజారోగ్య చర్యలు చేపట్టడం అవసర మని కేంద్రం భావించింది. ప్రారంభ దశలోనే ఇటువంటి ప్రమాదాలను గుర్తించి, నియంత్రించినట్లయితే కరోనాను కట్టడి చేయొచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది.

Updated Date - 2023-04-23T10:19:43+05:30 IST