Share News

Amaravati: 8వ తరగతి పిల్లలకు నేటి నుంచి ట్యాబ్‌ల పంపిణీ

ABN , Publish Date - Dec 21 , 2023 | 09:14 AM

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎనిమిదవ తరగతి పిల్లలకు గురువారం నుంచి ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమం జరగనుంది. ట్యాబ్‌లలో ఈసారి 11, 12 తరగతుల పాఠ్యాంశాలు కూడా లోడ్ చేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది.

Amaravati: 8వ తరగతి పిల్లలకు నేటి నుంచి ట్యాబ్‌ల పంపిణీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎనిమిదవ తరగతి పిల్లలకు గురువారం నుంచి ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమం జరగనుంది. ట్యాబ్‌లలో ఈసారి 11, 12 తరగతుల పాఠ్యాంశాలు కూడా లోడ్ చేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. ట్యాబ్‌లను విద్యార్దులు మిస్ యూజ్ చేస్తున్నారంటూ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో విద్యార్ధులు ఏం చూస్తున్నారో సెంట్రల్ మానిటరింగ్ సిష్టం ద్వారా కంట్రోల్ రూం నుండి మానిటర్ చేస్తున్నామని మంత్రి బోత్స సత్యనారాయణ తెలిపారు ఎవరైనా ట్యాబ్‌లను మిస్ యూజ్ చేసినట్టు తెలిస్తే వెంటనే వారి స్కూల్‌కు, తల్లిదండ్రులకు తెలియజేస్తున్నామని మంత్రి అన్నారు. ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి విద్యార్ధుల తల్లిదండ్రుల నుంచి ట్యాబ్‌ల మిస్ యూజ్‌పై పిర్యాదులు వచ్చాయి.

కాగా ట్యాబ్‌లు రిపేర్ వచ్చిన వెంటనే వాటిని ప్రభుత్వం బాగు చేయించడంలేదు. సుమారు 7 వేల ట్యాబ్‌లకు స్క్రీన్‌లు పగిలిపోయినా వాటకి వ్యారెంటీ లేకపోవడడంతో విద్యాశాఖ రీప్లేస్ చేయలేదు. దీంతో ఈసారి స్క్రీన్ కూడా వ్యారంటీ తీసుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది. బైజూస్ కంటెంట్‌ను పిల్లలు చదువుతున్నప్పుడు వస్తున్న డౌట్లు వివరించే విధానం లేకపోవడంతో మిరిన్ని సమస్యలు వస్తున్నాయి. ట్యాబ్‌లు ఇస్తున్న ప్రభుత్వం నిర్వహణను గాలికి వదిలేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. కాగా గురువారం సీఎం జగన్ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు.

Updated Date - Dec 21 , 2023 | 09:14 AM