AP News: గురుకుల పాఠశాలలో నాటు కోళ్ల పెంపకం... ఆందోళనలో విద్యార్థులు
ABN , First Publish Date - 2023-01-07T13:57:19+05:30 IST
జిల్లాలోని ద్వారకాతిరుమల బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల సిబ్బంది తీరుపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.
ఏలూరు: జిల్లాలోని ద్వారకాతిరుమల బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల సిబ్బంది తీరుపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల ప్రాంగణంలోనే సిబ్బంది యదేచ్చగా నాటు కోళ్ల పెంపకం చేపట్టారు. దీంతో విషజ్వరాలు ప్రబలే అవకాశం ఉందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇటీవల ఓ విద్యార్థిని అనారోగ్యంతో మృతి చెందడం వారి ఆందోళనకు మరింత భయభ్రాంతులకు గురవుతున్నారు.
గురుకుల పాఠశాల ఆవరణలో సిబ్బంది ఓ షెడ్డును నిర్మించి సుమారు 20 నాటు కోళ్లను పెంచడం ప్రారంభించారు. ఆ నాటు కోళ్లు పాఠశాల ప్రాంగణమంతా తిరుగుతూ వ్యర్ధాలను వెదజల్లుతున్నాయి. స్థానికుల కూడా పాఠశాల సిబ్బంది నాటు కోళ్ల పెంచడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీంతో సిబ్బంది తీరుపై పలువురు మండిపడుతున్నారు.
అయితే ఇటీవల గురుకుల పాఠశాలలో చదువుతున్న ఐదో తరగతి విద్యార్థి తీవ్ర అస్వస్థత గురై మృతి చెందింది. ఆ విద్యార్థి మృతికి జ్వరమే కారణమంటూ సిబ్బంది చేతులు దులుపుకున్నారు. ఇప్పటివరకు ఆ విద్యార్థి మృతికి గల స్పష్టమైన కారణాలు తెలియ రాలేదు. ఇంత జరుగుతున్న కళాశాల ప్రిన్సిపల్ నాటు కోళ్ల పెంపకం మానలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు విద్యార్థి మృతిపై విచారణ జరిపి నిబంధనలకు విరుద్ధంగా నాటు కోళ్లు పెంచుతున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.