Chandrababu: ఎన్ని విమర్శలు వచ్చినా జగన్‌కు సిగ్గులేదు..
ABN , First Publish Date - 2023-02-24T15:57:16+05:30 IST
అమరావతి: ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని సిద్ధం చేయటమే లక్ష్యంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) జోన్ 2 (Zone 2) కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు.
అమరావతి: ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని సిద్ధం చేయటమే లక్ష్యంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) జోన్ 2 (Zone 2) కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏలూరు (Eluru) సమీపంలోని చోదిమెళ్ళ దగ్గర ఈ భేటీ జరుగుతోంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీకి కార్యకర్తలే (TDP Activists) బలమని.. వారే ఆస్తి అని అన్నారు. కార్యకర్తలు అనుకుంటే పార్టీ తేలిగ్గా గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు రాజకీయ నాయకులతో పోరాడామని, ఇప్ఫుడు వింత జంతువులతో పోరాడుతున్నామని అన్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా సీఎం జగన్ (CM Jagan)కు సిగ్గులేదన్నారు. ‘హు కిల్డ్ బాబాయి (Hu Killed Babai) అని అడిగితే’ ఎవరు చంపారో గూగుల్ (Google) చెప్పేస్తుందన్నారు.
భయంకరంగా మనిషిని చంపేసి, గుండెపోటుతో చనిపోయాడని ప్రచారం చేసారని చంద్రబాబు మండిపడ్డారు. నారావారి రక్త చరిత్ర అని తనపై
వేసి అందరిని మోసం చేశారని విమర్శించారు. సాక్షి గుమస్తా సజ్జల (Sajjala) ఏది వస్తే అది వాగేస్తారన్నారు. సీబీఐ (CBI) విచారణ జరుపుతుంటే.. అదంతా తప్పని సీఎం సలహదారు అంటున్నారని.. రూ. 40 కోట్ల సుపారీ ఇచ్చారు.. ఆ డబ్బులు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. ఇది అంతఃపుర హత్యని అభివర్ణించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నూటికి వెయ్యి శాతం టీడీపీయే గెలుస్తుందని చంద్రబాబు అన్నారు. రాబోయే ఎన్నికల్లో రావణాసురునితో పోరాటం చేయబోతున్నామన్నారు. ప్రభుత్వం పెట్టిన ఇంటింటికి వైసీపీ అట్టర్ ప్లాప్ అయిందన్నారు. గడప గడపకు పెట్టారు.. వైసీపీ ప్రజా ప్రతినిధులు వెళ్లకుండా, అధికారులను పంపించారని ఎద్దేవా చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని.. పోలీసులను అడ్డం పెట్టుకుంటున్నారని చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.