ఏలూరు జనరల్ ఆసుపత్రిలో దారుణం.. మహిళకు సిజేరియన్ చేసి..
ABN , First Publish Date - 2023-08-16T12:50:21+05:30 IST
ఏలూరు జనరల్ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. మహిళకు సిజేరియన్ చేసి కడుపులో వైద్యులు కత్తెర మరిచారు. మూడు నెలల క్రితం ఈ ఘటన జరిగింది. అయితే ఇటీవల మహిళకు కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఏలూరు ఆసుపత్రికి తీసుకువెళ్లారు.
ఏలూరు : ఏలూరు జనరల్ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. మహిళకు సిజేరియన్ చేసి కడుపులో వైద్యులు కత్తెర మరిచారు. మూడు నెలల క్రితం ఈ ఘటన జరిగింది. అయితే ఇటీవల మహిళకు కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఏలూరు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఎక్స్‌రే తీసిన వైద్యులు ఆమె కడుపులో కత్తెర ఉన్న విషయాన్ని గుర్తించారు. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు విజయవాడకు తరలించగా.. అక్కడి వైద్యులు సర్జరీ చేసి కత్తెరను తొలగించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.