AP News: దంపతుల మధ్య విభేదాలు.. చివరకు ఆ భర్త ఎంతటి దారుణానికి పాల్పడ్డాడంటే...

ABN , First Publish Date - 2023-08-19T10:42:45+05:30 IST

అన్యోన్యంగా కలిసుండాల్సిన భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు ప్రాణాలు తీసే వరకు వెళ్తున్నాయి.

AP News: దంపతుల మధ్య విభేదాలు.. చివరకు ఆ భర్త ఎంతటి దారుణానికి పాల్పడ్డాడంటే...

పశ్చిమగోదావరి: అన్యోన్యంగా కలిసుండాల్సిన భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు ప్రాణాలు తీసే వరకు వెళ్తున్నాయి. కడదాకా తోడుండాల్సిన భర్తే ఆమె పాలిట యమపాశంగా మారాడు. గొడవులు ఉంటే సామరస్యంగా మాట్లాడుకోవాల్సింది పోయి ఏకంగా ప్రాణాలు తీసేందుకు వెనకాడలేదు ఆ భర్త. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తే భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు. భార్యను చాకుతో పొడిచి చంపేశాడు. ఆకివీడుకు చెందిన సంధ్యారాణి, రాంబాబు భార్యభర్తలు. అయితే వీరివురి మధ్య గత కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకున్నాయి. భార్యాభర్తలు ఇరువురూ తరచూ గొడవ పడ్డారు. ఈ క్రమంలో భార్యపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న భర్త ఏకంగా ఆమె ప్రాణాలు తీయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా గుడికి బండిపై వెళ్తున్న భార్య సంధ్యారాణిని భర్త రాంబాబు వెనుక నుంచి వచ్చి చాకుతో పొడిచాడు. ఆమెపై విచక్షణారహితంగా దాడి చేయడంతో సంధ్యారాణి అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం భర్త రాంబాబు అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న భర్త కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా.. కన్నబిడ్డ ఇంత దారుణంగా హత్యకు గురవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Updated Date - 2023-08-19T10:42:45+05:30 IST