YCP: తెనాలిలో వైసీపీ మంత్రుల సామాజిక సాధికార యాత్రకు స్పందన కరువు
ABN , First Publish Date - 2023-10-26T19:37:46+05:30 IST
తెనాలిలో వైసీపీ మంత్రుల సామాజిక సాధికార యాత్రకు స్పందన కరువైంది.
గుంటూరు జిల్లా: తెనాలిలో వైసీపీ మంత్రుల సామాజిక సాధికార యాత్రకు స్పందన కరువైంది. జనం లేక రెండు గంటలు ఆలస్యంగా సభ ప్రారంభమైంది. సభ జరుగుతుండగానే కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. నేతల ఊక దంపుడు ఉపన్యాసాలతో జనం విసిగిపోయాయి. జనం లేక తెనాలి సాధికార సభ వెలవెలబోయింది. జిల్లా నేతలు జన సమీకరణకు విశ్వ ప్రయత్నాలు చేశారు.