YCP MLA: సమస్యలపై ప్రశ్నించగా.. ఛీత్కరించుకుంటూ వెళ్లిపోయిన ఎమ్మెల్యే వసంత

ABN , First Publish Date - 2023-08-28T11:56:09+05:30 IST

మైలవరంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌కు చేదు అనుభవం ఎదురైంది. మూడు నెలల అనంతరం మైలవరం పట్టణంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. మైలవరంలోని సచివాలయం -3 పరిధిలోని అయ్యప్ప నగర్, చంద్రబాబు నగర్లలో ఎమ్మెల్యేను పలు సమస్యలపై మహిళలు నిలదీశారు.

YCP MLA: సమస్యలపై ప్రశ్నించగా.. ఛీత్కరించుకుంటూ వెళ్లిపోయిన ఎమ్మెల్యే వసంత

ఎన్టీఆర్ జిల్లా - మైలవరం: మైలవరంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌కు (MLA Vasantha Venkatar Krishnaprasad) చేదు అనుభవం ఎదురైంది. మూడు నెలల అనంతరం మైలవరం పట్టణంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. మైలవరంలోని సచివాలయం -3 పరిధిలోని అయ్యప్ప నగర్, చంద్రబాబు నగర్లలో ఎమ్మెల్యేను పలు సమస్యలపై మహిళలు నిలదీశారు. డ్రైనేజీ లేక ఇబ్బందులు పడుతున్నామని, మురుగు నీరు ముందుకు వెళ్లకపోవడంతో దోమలు పెరుగుతున్నాయని అయ్యప్ప నగర్‌లో ఓ మహిళ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చింది. సిమెంట్ రోడ్డు వేసామని ఎమ్మెల్యే అనగా.. డ్రైనేజీ లేకుండా సిమెంట్ రోడ్డు పోస్తే ఏం ఉపయోగమంటూ మహిళ సమాధానం ఇచ్చింది. ఇంతకన్నా చిన్న చిన్న రోడ్లు చాలా ఉన్నాయంటూ మహిళను ఎమ్మెల్యే ఛీత్కరించుకుంటూ వెళ్లిపోయారు.


అటు చంద్రబాబునగర్‌లోనూ ఎమ్మెల్యేకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఎన్నికల్లో తాము ఓట్లు వేయలేదా, ఒక్కో ఇంట్లో మూడు, నాలుగు ఇళ్ల పట్టాలు ఇచ్చారని, తమకు ఎందుకు ఇవ్వలేదని వైసీపీ నాయకులను ముస్లిం మహిళ ప్రశ్నించింది. మొహాలు చూసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నారని వైసీపీ నాయకులపై సదరు మహిళ గొడవకు దిగింది. ఇళ్ల స్థలం కోసం మరలా అర్జీ పెట్టుకోవాలని వైసీపీ నాయకులు చెప్పగా ఎన్నిసార్లు అర్జీ పెట్టుకున్న ఇవ్వడం లేదని, ఇళ్ల స్థలం కోసం అడుగుతున్నానని ఒక నాయకుడు ఇటు వైపు రావడమే మానేసాడంటూ ఆ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రబాబునగర్‌లో సిమెంట్ రహదారులు వేయాలని మహిళలు కోరారు.


అయితే మహిళలు సహనంగా సమాధానాల చెప్పాల్సి ఎమ్మెల్యే ఒకింత అసహనానికి గురయ్యారు. ‘‘కొండవాగు స్థలం ఆక్రమించుకొని నివాసం ఉంటున్నారని, మీ అందరికి పూరగుట్టలో స్థలాలు ఇచ్చాము కదా మీరు ఇళ్ళు ఖాళీ చేసి అక్కడికు వెళ్లకుండా, చంద్రబాబు నగర్‌లో రోడ్లు వేయమని అడిగితే ఏం చేయాలి’’ అంటూ మహిళలపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. ఇల్లీగల్, అనుమతులు లేని స్థలాల్లో ఉంటున్నారని పూరగుట్టలో స్థలాలు ఇచ్చామని మళ్ళీ రోడ్లు అడగటం కరెక్ట్ కాదని ఏం చేద్దామో చెప్పండని నాయకులను ఎమ్మెల్యే అడిగారు. గడప గడపలో ప్రజలు సమస్యలు చెబుతుండటంతో అధికారులు వల్లే ఈ పరిస్థితి వచ్చిందని వైసీపీ నాయకులు చెవులు కొరుక్కుంటున్న పరిస్థితి.

Updated Date - 2023-08-28T11:56:09+05:30 IST