Share News

Maganti Babu: 'నిజం గెలవాలి' అంటూ ప్రజల్లోకి వచ్చిన నారా భువనేశ్వరికి ప్రతి ఒక్కరూ తోడుగా నిలవాలి

ABN , First Publish Date - 2023-10-28T18:31:19+05:30 IST

జగన్ సర్కారుపై టీడీపీ సీనియర్ నేత, ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు (Maganti Babu) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Maganti Babu: 'నిజం గెలవాలి' అంటూ ప్రజల్లోకి వచ్చిన నారా భువనేశ్వరికి ప్రతి ఒక్కరూ తోడుగా నిలవాలి

ఏలూరు జిల్లా: జగన్ సర్కారుపై టీడీపీ సీనియర్ నేత, ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు (Maganti Babu) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి నిద్రిస్తుండగా కలలో ప్రత్యక్షమయ్యి కొడుకు జగన్ మోహన్ రెడ్డి ప్రవర్తనపై స్వర్గీయ రాజశేఖరరెడ్డి తీవ్రంగా బాధ పడ్డాడని మాగంటి బాబు తెలిపారు. నూజివీడులో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ టీడీపీ నియోజకవర్గ కార్యకర్తల విసృతస్థాయి సమావేశ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మాగంటి బాబు పాల్గొన్నారు.

తండ్రి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి సమయంలోనూ, భర్త ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలోనూ ఏనాడూ ఇంటి గుమ్మం దాటకుండా సేవా కార్యక్రమాలకే పరిమితమైన నారాభువనేశ్వరి (Nara Bhuvaneswari) నేడు నిజం గెలవాలి అంటూ ప్రజల్లోకి రావడంతో ప్రతి ఒక్కరం తోడుగా నిలవాలన్నారు. వయస్సు రీత్యా అనారోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని చంద్రబాబునాయుడుకు బదులు తనను జైల్లో పెట్టాలని జగన్ ను కోరినట్లు మాగంటి బాబు తెలిపారు. రాత్రి నిద్రలో రాజశేఖరరెడ్డి కలలో కనిపించి, తండ్రి వయస్సులో ఉన్న చంద్రబాబునాయుడుపై తన కొడుకు ప్రవర్తిస్తున్న తీరును తప్పు అని చెప్పి.. మంచి చెడులు సూచించాలని కోరినట్లు మాగంటి బాబు తెలిపారు.

Updated Date - 2023-10-28T18:32:20+05:30 IST