Osmania Hospital: వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి స్వల్ప అస్వస్థత.. ఉస్మానియాలో వైద్యం

ABN , First Publish Date - 2023-05-26T16:02:18+05:30 IST

వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి (YS Bhaskar Reddy) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.

Osmania Hospital: వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి స్వల్ప అస్వస్థత.. ఉస్మానియాలో వైద్యం

హైదరాబాద్‌: వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి (YS Bhaskar Reddy) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం భాస్కర్‌రెడ్డి చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. బీపీ పెరగడంతో ఉస్మానియాలో వైద్యులు చికిత్స అందించారు. చికిత్స తర్వాత భాస్కర్‌రెడ్డిని పోలీసులు మళ్లీ జైలుకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం రేపు నిమ్స్‌కు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.

కాగా.. కర్నూలు ఆస్పత్రి నుంచి కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి డిశ్చార్జ్‌ అయ్యారు. హైదరాబాద్‌ ఏఐజీ ఆస్పత్రికి శ్రీలక్ష్మిని కుటుంబసభ్యులు తరలించారు. ఏఐజీ ఆస్పత్రిలోనే ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నారు.

Updated Date - 2023-05-26T16:02:18+05:30 IST