Flight Tickets: ఎయిరిండియా బంపర్ ఆఫర్.. రూ.1,470కే విమాన టిక్కెట్
ABN , First Publish Date - 2023-08-17T18:28:00+05:30 IST
ఒక్కసారైనా విమాన ప్రయాణం చేయాలని భావించేవాళ్ల కోసం ఎయిరిండియా ప్రత్యేకంగా 96 గంటల సేల్ నిర్వహిస్తోంది. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ప్రయాణాల కోసం కేవలం ప్రారంభ ధరగా రూ.1,470 చెల్లించి ఈ ఆఫర్ పొందవచ్చు. ఈ ఆఫర్‌లో భాగంగా టిక్కెట్లపై కన్వీనియన్స్ ఫీజు కూడా ఉండదని ఎయిరిండియా వెల్లడించింది.
జీవితంలో విమానంలో ఒక్కసారైనా ప్రయాణించాలని కలలు కనే మధ్యతరగతి ప్రజలు చాలామందే ఉంటారు. అలాంటి వాళ్లు విమాన టిక్కెట్ల విషయంలో ధరలు చూసి వెనక్కి తగ్గుతారు. అయితే మధ్యతరగతి ప్రజలకు విమాన టిక్కెట్ల ధరలను టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా తక్కువ ధరలకే అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు టిక్కెట్ ధరలపై భారీ డిస్కౌంట్ ఇస్తున్నామని తెలిపింది. కేవలం బస్ టిక్కెట్ ధరకే విమానంలో ప్రయాణించేలా ఎయిరిండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు ఈ ఆఫర్ కింద ఎప్పుడైనా విమాన ప్రయాణం చేయవచ్చు. గరిష్టంగా 15 శాతం వరకు టిక్కెట్ బుకింగ్‌పై డిస్కౌంట్ పొందవచ్చని ఎయిరిండియా తెలిపింది.
ఇది కూడా చదవండి: Gold and Silver Price : నేడు భారీగా తగ్గిన బంగారం ధర
ఒక్కసారైనా విమాన ప్రయాణం చేయాలని భావించేవాళ్ల కోసం ఎయిరిండియా ప్రత్యేకంగా 96 గంటల సేల్ నిర్వహిస్తోంది. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ప్రయాణాల కోసం కేవలం ప్రారంభ ధరగా రూ.1,470 చెల్లించి ఈ ఆఫర్ పొందవచ్చు. బిజినెస్ క్లాస్ టిక్కెట్ కోసం అయితే రూ.10,130 నుంచి ధర ప్రారంభం అవుతుంది. ఆగస్ట్ 17 నుంచి 20 వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుందని ఎయిరిండియా వివరించింది. ఎయిరిండియా వెబ్‌సైట్, కంపెనీ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవడం వల్ల ఈ డిస్కౌంట్ ఆఫర్ సొంతం చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఆఫర్‌లో భాగంగా టిక్కెట్లపై కన్వీనియన్స్ ఫీజు కూడా ఉండదని ఎయిరిండియా వెల్లడించింది. అంతేకాకుండా ఎయిరిండియలోనే రిటర్న్ జర్నీ చేసే ప్రయాణికులకు డబుల్ లాయల్టీ బోనస్ పాయింట్లు కూడా లభిస్తాయని పేర్కొంది. అన్ని రకాల టికెట్లపైనా ఈ లాయల్టీ బోనస్ వర్తిస్తుందని ప్రకటించింది. అయితే గ్రూప్ బుకింగ్‌లపై ఈ ఆఫర్ వర్తించదని ఎయిరిండియా తెలిపింది.