Anant Ambani: వైభవంగా అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ నిశ్చితార్థం
ABN , First Publish Date - 2023-01-19T20:27:41+05:30 IST
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ(Anant Ambani), రాధిక మర్చంట్ (Radhika Merchant) నిశ్చితార్థం ముంబైలో అంగరంగ వైభవంగా జరిగింది.
ముంబై: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ(Anant Ambani), రాధిక మర్చంట్ (Radhika Merchant) నిశ్చితార్థం ముంబైలో అంగరంగ వైభవంగా జరిగింది. సన్నిహిత మిత్రులు, కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్థాన్ని వేడుకగా నిర్వహించారు. అనంత్ అంబానీ, రాధిక ఒకరికొకరు ముందే తెలుసు. గతేడాది డిసెంబరు 29న రాజస్థాన్‌లోని నాథ్ద్వారాలో వీరిద్దరికి ‘రోకాఫీడ్’(ముందస్తు నిశ్చితార్థం) వేడుక జరిగింది. ఇప్పుడు వీరిద్దరికీ అధికారికంగా ఆ కార్యక్రమం నిర్వహించారు.
నిశ్చితార్థం సందర్భంగా గురువారం సాయంత్రం సంప్రదాయ వేడుకలైన గోలా ధానా, చునారీ విధి వంటివి నిర్వహించారు. ఈ వేడుక కోసం ఇషా అంబానీ(Isha Ambani), ఇతర కుటుంబ సభ్యులు ఉదయమే రాధిక ఇంటికి చేరుకుని సాయంత్రం నిర్వహించే కార్యక్రమానికి ఆహ్వానించారు. ఇంటికి వచ్చిన మర్చంట్ కుటుంబాన్ని అంబానీ కుటుంబం సాదరంగా స్వాగతించింది. విఘ్నేశ్వరుడి పూజతో కార్యక్రమం ప్రారంభమైంది. ఆ తర్వాత లగ్న పత్రికను చదివారు. అనంత్ అంబానీ, రాధిక ఉంగరాలు మార్చుకోవడంతో కార్యక్రమం ప్రారంభమైనట్టు ఇషా అంబానీ ప్రకటించారు.
ముకేశ్ అంబానీ-నీతా అంబానీ చిన్న కుమారుడే అనంత్ అంబానీ. అమెరికాలోని బ్రౌన్ యూనివర్సీటీ పట్టభద్రుడు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో పలు పదవుల్లో పనిచేశారు. జియో ప్లాట్‌ఫామ్స్, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ బోర్డ్స్‌లో సభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎనర్జీ బిజినెస్‌ను చూసుకుంటున్నారు.
శైల-వీరేన్ మర్చంట్ కుమార్తె అయిన రాధిక న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఎన్కోర్ హెల్త్‌కేర్ బోర్డ్ డైరెక్టర్‌గా ఉన్నారు