Apple: యాపిల్ సీఈఓ టిమ్ కుక్ సంచలన నిర్ణయం
ABN , First Publish Date - 2023-01-13T12:48:49+05:30 IST
గ్లోబల్ దిగ్గజ సంస్థ యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు....
బ్లూమ్‌బెర్గ్: గ్లోబల్ దిగ్గజ సంస్థ యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.(Apple CEO Tim Cook) 2023వ సంవత్సరంలో సీఈఓ తన జీతంలో 40 శాతం కోత విధించుకునేందుకు టిమ్ కుక్ నిర్ణయించుకున్నారు.(40 percentage Pay Cut) సీఈఓ తీసుకున్న నిర్ణయానికి వాటాదారుల అనుమతి లభించాల్సి ఉంది. గత ఏడాది టిమ్ కుక్ సీఈఓగా 99 మిలియన్ డాలర్లు పొందారు. 2023వ సంవత్సరంలో ఈ జీతాన్ని 49 డాలర్లకు తగ్గించుకోనున్నారు. టిమ్ కుక్కు యాపిల్ చెల్లిస్తున్న జీతంపై మార్కెట్ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.ఈ నేపథ్యంలో టిమ్ కుక్ జీతం 40 శాతం తగ్గించుకోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా సీఈఓ టిమ్ కుక్ తన సంపదను ఛారిటీ కార్యక్రమాలకు అందజేస్తానని ప్రకటించారు.