Credit Card Penalty: క్రెడిట్ కార్డు బిల్లును సకాలంలో కట్టకపోయినా.. జరిమానా పడకుండా ఉండాలంటే..!
ABN , First Publish Date - 2023-07-26T09:54:10+05:30 IST
క్రెడిట్ కార్డు బిల్లు ఆలస్యంగా కడితే బ్యాంకులు ముక్కు పిండి జరిమానా వసూలు చేస్తాయి. కానీ ఈ విషయం తెలుసుకుంటే జరమానా అనే ప్రస్తావనే రాదు..
ఇప్పట్లో ప్రతి ఒక్కరి దగ్గరా క్రెడిట్ కార్డ్ ఉంటుంది. కావలసిన వస్తువులు ఈ క్రెడిట్ కార్డ్ నుండి కొనుగోలు చేసి బ్యాంకులకు నెలనెలా డబ్బు చెల్లిస్తుంటారు. క్రమం తప్పకుడం ఈ బిల్లును చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కరోజు ఆలస్యం జగిగినా బ్యాంకులు ముక్కు పిండి జరిమానా వసూలు చేస్తాయి. సరైన సమయానికి నెలవారీ చెల్లింపులు చేపట్టకపోతే జరిమానా మాత్రమే కాకుండా క్రెడిట్ స్కోర్ మీద ప్రభావం పడుతుంది. క్రెడిట్ కార్డ్ మీడ రుణం తీసుకోవాలంటే క్రెడిట్ స్కోర్ ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే.. ఈ నేపధ్యంలో క్రెడిట్ కార్డు బిల్లు సకాలంలో కట్టకపోయినా జరిమానా పడకుండా ఉండాలంటే ఈ ఒక్కపని చేస్తే సరిపోతుంది..
క్రెడిట్ కార్డు బిల్లులను(credit card bill) నిర్దేశించిన తేది లోపు చెల్లించేయాలని నియమం ఉంది. అయితే ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు కలిగి ఉన్నవారు, ఎక్కువ పని ఒత్తిడిలో గడిపేవారు క్రెడిట్ కార్డ్ బిల్లులు ట్రాక్ చేయడంలో విఫలమవుతుంటారు. ఈ కారణంగా జరిమానా కట్టాల్సి వస్తుంది(credit card penalty). క్రెడిట్ కార్డు బిల్లు ఎంత అనేదాని మీద ఈ జరిమానా ఆదారపడి ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో(SBI) రూ. 500 -1000 మధ్య చెల్లింపుకు గానూ 400రూపాయల జరిమానా విధిస్తారు. అదే రూ.1000-10,000 మధ్య చెల్లింపు ఉంటే రూ.750 జరిమానా విధిస్తారు. 25వేల నుండి 50వేల లోపు చెల్లింపు ఉంటే 1300రూపాయల జరిమానా విధిస్తారు. క్రెడిట్ కార్డ్ బిల్లు మిస్సయిన ప్రతిసారి ఈ జరిమానా కట్టాల్సిందే.. ఇలా వివిధ బ్యాంకులు బిల్లును బట్టి జరిమానా విధిస్తాయి.
Wife Video: సరుకులు తీసుకునేందుకని వెళ్లి.. భార్యకు భారీ షాకిచ్చాడుగా.. భర్త ఫోన్ చేశాడని ఇంటి బయటకు వచ్చి చూస్తే..!
క్రెడిట్ కార్డు బిల్లును సకాలంలో కట్టలేకపోతే ఇక మన పని అయిపోయింది, నోరుమూసుకుని జరిమానా కట్టాల్సిందే అనుకుంటారు చాలామంది. కానీ అలాంటి భయం అక్కర్లేదు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకారం పొరపాటున క్రెడిట్ కార్డ్ బిల్లు ట్రాక్ చేయడం మరచిపోయి బిల్లు కట్టలేనివారికి మరొక 3రోజులు అవకాశం ఉంది. ఉదాహరణకు క్రెడిట్ కార్డ్ బిల్లు జులై 25వతేదీ కట్టాల్సి ఉన్నా కట్టలేకపోతే ఆ తరువాత 3రోజులు అంటే 26,27,28 తేదీలలో ఎప్పుడైనా కట్టవచ్చు. ఈ సమయంలో కట్టడం ద్వారా క్రెడిట్ స్కోర్ మీద ఎలాంటి ప్రభావం ఉండదు. జరిమానా అనే ప్రస్తావన కూడా రాదు.