Income Tax Return: ఐటీ రిటర్న్‌లకు ఇంకా 6 రోజులే గడువు.. జూలై 31 లోపు నమోదు చేయలేకపోతే.. జరిగేది ఇదే..!
ABN , First Publish Date - 2023-07-25T12:20:38+05:30 IST
ఇన్కమ్ టాక్స్ రిటర్న్ దాఖలు సమయం ఏప్రిల్ 1న మొదలై జులై 31తో తీరిపోతుంది. కేవలం 6రోజులలో ఈ పని చేయకపోతే..
సంపాదన ఉన్న ప్రతి వారు పన్ను చెల్లించాల్సిందే. ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఏడాదికి 5లక్షల ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరూ ఇన్కమ్ టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. 2022-2023 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆదాయపు పన్ను రిటర్న్ కు దాఖలు చెయ్యాల్సిన సమయం ముగింపుకు వస్తోంది. ఈ నెల 31వ తేదీలోపు 5లక్షల ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పని చేయాలి. లేకపోతే జరిగే పరిణామాలు నష్టాన్ని కలిగిస్తాయి. పన్ను చెల్లింపుదారులు వారి ఆదాయ వివరాలను నమోదు చేయడానికి, ఇన్కమ్ టాక్స్ రిటర్న్ ను సరిగ్గా పొందుపరచడానికి ప్రభుత్వం 4నెలల సమయం ఇస్తుంది. ఇది ఏఫ్రిల్ 1వ తేదీతో ప్రారంభమై జులై 31తో ముగుస్తుంది. పన్ను చెల్లించేవారు 6రోజుల లోపు ఇన్కమ్ టాక్స్ రిటర్న్ దాఖలు చేయాలి. లేకపోతే జరిమానా నుండి జైలు శిక్ష వరకు పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
సాధారణంగా ప్రభుత్వం ఈ ఇన్కమ్ టాక్స్ రిటర్న్(ITR) దాఖలు గడువు ప్రతి ఏడాది పెంచేది. అయితే ఈ ఏడాది అలాంటి ప్రకటన ఏదీ రాకపోవడంతో జులై 31వ తేదీలోపు అందరూ ఈ పని పూర్తీ చేయాల్సి వస్తోంది(ITR File last date july31). జులై 31వ తేదీ లోపు ఇన్కమ్ టాక్స్ రిటర్న్ ఫైల్ చేయకపోతే ఆ తరువాత డిసెంబర్ 31వరకు గడువు ఇస్తారు. కానీ ఆలస్యంగా దాఖలు చేసినందుకు జరిమానా విధిస్తారు. ఇది గరిష్టంగా 5వేల వరకు ఉంటుంది. 5లక్షల ఆదాయం ఉన్నవారు రూ.1000 జరిమానా(1000rs fine) చెల్లించాల్సి ఉంటుంది.
Viral: ఏమండోయ్.. ఇది విన్నారా..? ఈ రెస్టారెంట్‌లో భోజనం చేసిన తర్వాత.. కాసేపు కునుకు తీసేందుకు ప్రత్యేక ఏర్పాటు..!
ఇస్కమ్ టాక్స్ రిటర్న్ ఫైల్ ఆలస్యంగా దాఖలు చేయడానికి సెక్షన్139(1) లోని సబ్ సెక్షన్(8A) అవకాశం ఇస్తుంది. ఇది డిసెంబర్ 31లోపు పైల్ చేయడానికి సహాయపడుతుంది. అది కూడా ముగిసిపోయిన తరువాత టాక్స్ చెల్లించకపోతే సెక్షన్(142) సహాయపడుతుంది. ఇది గత ఏడాది టాక్స్ చెల్లింపుకు సహాయపడుతుంది. ఇకపోతే ఈ ఇన్కమ్ టాక్స్ రిటర్న్ దాఖలు డిసెంబర్ 31 తరువాత చేస్తే మాత్రం 10వేల వరకు జరిమానా సమర్పించుకోవాల్సి వస్తుంది. కేవలం జరిమానా మాత్రమే కాదు, నిర్థేశించిన విధంగా వడ్డీ కూడా చెల్లించాల్సిందిగా చర్యలు తీసుకుంటారు. సెక్షన్234A కింద నెలకు 1శాతం లేదా దానిలో వారు సూచించినంత పన్ను రూపంలో కట్టాల్సి వస్తుంది. అందుకే జులై 31లోపు ఈ పని పూర్తీ ఏ జరిమానాలు, అనవసరపు టెన్షన్లు లేకుండా ఉండొచ్చు.