Reliance Jio: తిరుపతి, నెల్లూరు వాసులకు జియో గుడ్ న్యూస్!

ABN , First Publish Date - 2023-01-09T21:39:22+05:30 IST

తిరుపతి(Tirupati), నెల్లూరు(Nellore)లోని జియో వినియోగదారులకు రియలన్స్ జియో(Reliance Jio) శుభవార్త చెప్పింది. ఈ రెండు పట్టణాల్లో

Reliance Jio: తిరుపతి, నెల్లూరు వాసులకు జియో గుడ్ న్యూస్!

విజయవాడ: తిరుపతి(Tirupati), నెల్లూరు(Nellore)లోని జియో వినియోగదారులకు రియలన్స్ జియో(Reliance Jio) శుభవార్త చెప్పింది. ఈ రెండు పట్టణాల్లో జియో ట్రూ 5జీ(True 5G) సేవలను ప్రారంభించింది. ఇప్పటికే తిరుమల, విశాఖపట్టణం, విజయవాడ, గుంటూరు పట్టణాల్లో జియో 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి ఏపీలోని ప్రతి పట్టణం, తాలూకా, మండలం, గ్రామాల్లో జియో ట్రూ 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని ఈ సందర్భంగా జియో పేర్కొంది.

ఏపీలో నెట్‌వర్క్ కోసం జియో ఇప్పటికే రూ. 26 వేల కోట్ల పెట్టుబడి పెట్టింది. అదనంగా 5జీ నెట్‌వర్క్ ఏర్పాటు కోసం మరో రూ. 6,500 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. జియో 5జీ సేవలు అందుబాటులోకి రావడంతో ఏపీకి ఉత్తమ టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్ అందినట్టు అయింది. ఇ-గవర్నెన్స్, విద్య, వైద్యం, ఐటీ, ఎస్ఎంఈ వ్యాపార రంగాల్లో వృద్ధి అవకాశాలకు ఇది ద్వారాలు తెరుస్తుంది.

సేవల ప్రారంభం సందర్భంగా జియో ఏపీ సీఈవో మందపల్లి మహేశ్ కుమార్ మాట్లాడుతూ.. ఏపీలో జియో ట్రూ 5జీని విస్తరించినందుకు ఆనందంగా ఉందన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరికి జియో ట్రూ 5జీ ప్రయోజనాలను అందించేందుకు జియో ఇంజినీర్లు 24 గంటలూ పనిచేస్తున్నట్టు చెప్పారు.

Updated Date - 2023-01-09T21:39:24+05:30 IST