SBI account holders: ఎస్‌బీఐ ఖాతాదారులకు చిన్న గుడ్‌న్యూస్.. ఆగస్టు 15 వరకే ఛాన్స్..

ABN , First Publish Date - 2023-06-30T16:39:55+05:30 IST

ఎస్‌బీఐ (SBI) తన ఖాతాదారుల కోసం పున:ప్రవేశపెట్టిన ‘ఎస్‌బీఐ అమృత్ కలశ్ డిపాజిట్ ఎఫ్‌డీ స్కీమ్‌’ (SBI Amrit Kalash Deposit FD Scheme) గడువును బ్యాంక్ మరోసారి పొడగించింది. ఆకర్షణీయ వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తున్న ఈ ప్రత్యేక స్కీమ్ గడువు గతంలో జూన్ 30, 2023 వరకు ఉండగా... ఇప్పుడు దానిని ఆగస్టు 15, 2023 వరకు పొడగిస్తున్నట్టు బ్యాంక్ ప్రకటించింది. గడువు తేదీ వరకు అప్లికేషన్లు స్వీకరిస్తామని స్పష్టం చేసింది.

SBI account holders: ఎస్‌బీఐ ఖాతాదారులకు చిన్న గుడ్‌న్యూస్.. ఆగస్టు 15 వరకే ఛాన్స్..

ఎస్‌బీఐ (SBI) తన ఖాతాదారుల కోసం పున:ప్రవేశపెట్టిన ‘ఎస్‌బీఐ అమృత్ కలశ్ డిపాజిట్ ఎఫ్‌డీ స్కీమ్‌’ (SBI Amrit Kalash Deposit FD Scheme) గడువును బ్యాంక్ మరోసారి పొడగించింది. ఆకర్షణీయ వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తున్న ఈ ప్రత్యేక స్కీమ్ గడువు గతంలో జూన్ 30, 2023 వరకు ఉండగా... ఇప్పుడు దానిని ఆగస్టు 15, 2023 వరకు పొడగిస్తున్నట్టు బ్యాంక్ ప్రకటించింది. గడువు తేదీ వరకు అప్లికేషన్లు స్వీకరిస్తామని స్పష్టం చేసింది. కాగా అమృత్ కలశ్ డిపాజిట్ స్కీమ్ డిపాజిట్ పిరియడ్‌గా డిపాజిట్ పిరియడ్ 400 రోజులుగా ఉంది. ఇక దేశీయ రిటైల్ టర్మ్ డిపాజిట్స్(రూ.2 కోట్ల కంటే తక్కువ), కొత్త డిపాజిట్లు, డిపాజిట్ల రెన్యూవల్, టర్మ్ డిపాజిట్స్, స్పెషల్ టర్మ్ డిపాజిట్లు అర్హతగా ఉన్నాయి.

ఇతర వివరాలు ఇవే..

టర్మ్ డిపాజిట్లు - మెచ్యూరిటీని బట్టి నెలవారీ/త్రైమాసికం/ అర సంవత్సరం స్పెషల్ టర్మ్ డిపాజిట్స్ ఉంటాయి. వడ్డీ, నికర టీడీఎస్ కస్టమర్ ఖాతాలో జమవుతాయి. ఇతర విషయాలకు వస్తే.. ఆదాయ పన్ను చట్టం ప్రకారం టీడీఎస్ రేటు వర్తిస్తుంది. రిటైల్ టర్మ్ డిపాజిట్ వర్తింపునకు అనుగుణంగా విత్‌డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. లోన్ సదుపాయం కూడా ఉంది. బ్రాంచ్/ఐఎన్‌బీ/యోనో మార్గాల ద్వారా లోన్ తీసుకోవచ్చు.

Updated Date - 2023-06-30T16:39:55+05:30 IST