Sids Farm: ప్రొబయాటిక్ నేచురల్ పెరుగును విడుదల చేసిన సిద్స్ ఫామ్
ABN , First Publish Date - 2023-02-18T21:37:26+05:30 IST
తెలంగాణ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ స్వచ్ఛమైన పాలు, పెరుగును ఉత్పత్తి చేస్తుంది

హైదరాబాద్: డి2సి ప్రీమియం డెయిరీ బ్రాండ్ సిద్స్ ఫామ్(Sid's Farm) శనివారం ప్రొబయాటిక్ నేచురల్ కర్డ్(Probiotic Natural Curd)ను మార్కెట్లోకి విడుదల చేసింది. తెలంగాణ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ స్వచ్ఛమైన పాలు, పెరుగును ఉత్పత్తి చేస్తుంది. కాగా, తాజాగా విడుదల చేసిన ఈ పెరుగు తొలుత తెలంగాణ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉన్నట్టు కంపెనీ తెలిపింది. 400 గ్రాముల కప్ ప్రొ బయాటిక్ నేచురల్ కర్డ్ ధరను రూ. 80గా నిర్ణయించింది.
నెల రోజుల క్రితమే సిద్స్ ఫామ్ ఎ2 దేశీ ఆవు నెయ్యిని విడుదల చేసింది. హైదరాబాద్‌తోపాటు బెంగళూరులోని ఈ-కామర్స్ వెబ్‌సైట్లలోనూ సిద్స్ ఫామ్ ఉత్పత్తులు లభ్యమవుతున్నాయి. వీటిలో పన్నీర్, నెయ్యి, వెన్న వంటివి ఉన్నాయి. నేచురల్ కర్డ్ విడుదల సందర్భంగా సిద్స్ ఫామ్ వ్యవస్థాపకుడు, ఎండీ డాక్టర్ కిశోర్ ఇందుకూరి మాట్లాడుతూ.. పెరుగుల వల్ల పేగుల ఆరోగ్యంతోపాటు ఎముకల ఆరోగ్యం కూడా మెరుగవుతుందన్నారు. ఈ పెరుగులో ప్రొటీన్, కాల్షియం, జీర్ణక్రియకు తోడ్పడే బ్యాక్టీరియా ఉన్నట్టు చెప్పారు.