RED DARK: రెడ్ డార్క్ ఎడిషన్ ఎస్‌యూవీలను లాంచ్ చేసిన టాటా మోటార్స్

ABN , First Publish Date - 2023-02-23T20:35:40+05:30 IST

ఆటో ఎక్స్‌పో 2023లో లభించిన బ్లాక్‌బస్టర్ స్పందనతో సంతోషంలో మునిగిపోయిన టాటా మోటార్స్(Tata Motors) తాజాగా నెక్సాన్(Nexon), హారియర్(Harrier)

RED DARK: రెడ్ డార్క్ ఎడిషన్ ఎస్‌యూవీలను లాంచ్ చేసిన టాటా మోటార్స్

ముంబై: ఆటో ఎక్స్‌పో 2023లో లభించిన బ్లాక్‌బస్టర్ స్పందనతో సంతోషంలో మునిగిపోయిన టాటా మోటార్స్(Tata Motors) తాజాగా నెక్సాన్(Nexon), హారియర్(Harrier), సఫారీ(Safari) ఎస్‌యూవీల రెడ్‌డార్క్(Red Dark) ఎడిషన్‌ను విడుదల చేసింది. ఇవి కొత్త ఏడీఏఎస్(ADAS) ఫీచర్లతో వస్తున్నాయి. స్టాండర్డ్ వెర్షన్‌తో పోలిస్తే అత్యద్భుతమైన స్టైల్ వీటి సొంతం. నెక్సాన్ రెడ్ డార్క్ ఎడిషన్ పెట్రోలు, డీజిల్ వెర్షన్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది. హారియర్, సఫారీ రెడ్‌ డార్క్ ఎడిషన్ మోడళ్లు మాత్రం డీజిల్ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

నెక్సాన్ పెట్రోల్ రెడ్ డార్క్ ఎడిషన్ ధర రూ. 12.35 లక్షలు కాగా, డీజిల్ వేరియంట్ ధర రూ. 13.70 లక్షలు. ఇవి రెండు పాన్ ఇండియా ఎక్స్ షోరూం ధరలు. రెడ్ డార్క్ ఎడిషన్ ఎస్‌యూవీలను టాటా మోటార్స్ డీలర్‌షిప్ వద్ద రూ. 30 వేలు కట్టి ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. టాటా హారియర్ రెడ్ డార్క్ ఎడిషన్ ధర రూ. 21.77 లక్షలు కాగా, సఫారీ రెడ్ డార్క్ ఎడిషన్ సిక్స్ సీటర్, సెవెన్ సీటర్ ధరలు వరుసగా రూ. 22.71 లక్షలు. రూ. 21.61 లక్షలుగా నిర్ణయించింది.

ఈ సందర్భంగా టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎండీ శైలేష్ చంద్ర మాట్లాడుతూ.. ఏడీఏఎస్ వంటి అత్యంత ప్రతిస్పందించే 26.03 సెంటీమీటర్ల డిస్‌ప్లే ఇన్ఫోటైన్‌మెంట్, వినియోగదారు ఇంటర్‌ఫేస్ వంటి ఫీచర్లు, అనుభవాలతో ఈ కొత్త ఉత్పత్తులు యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయన్నారు. అడ్వాన్స్‌డ్, సురక్షితమైన, హైటెక్ ఫీచర్ కోసం వెతుకుతున్న నేటి కొత్త తరం కస్టమర్‌ల కోసం రూపొందించినట్టు చెప్పారు.

Updated Date - 2023-02-23T20:35:43+05:30 IST