Tata Nexon: ఈవీ మ్యాక్స్ డార్క్‌ను లాంచ్ చేసిన టాటా నెక్సాన్.. ఫీచర్లు చూస్తే అదుర్సే!
ABN , First Publish Date - 2023-04-17T21:03:30+05:30 IST
టాటా మోటార్స్ (Tata Motors) తాజాగా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ డార్క్(Nexon EV Max Dark)
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ (Tata Motors) తాజాగా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ డార్క్(Nexon EV Max Dark) ఎడిషన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 19.04 లక్షలు (ఎక్స్ షోరూం, ఇండియా). ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. అందులో ఒకటి ఎక్స్ జడ్ ప్లస్ ఎల్యుఎక్స్(XZ+ LUX) కాగా, రెండోది 7.2 కిలోవాట్ ఏసీ ఫాస్ట్ చార్జర్‌తో ఎక్స్‌జడ్ ప్లస్ ఎల్యుఎక్స్(XZ+ LUX). వీటిలో పలు అడ్వాన్స్డ్ ఫీచర్లు ఉన్నాయి. ఎస్యూవీ రేంజ్లో ఈ రెండూ ఫ్లాగ్షిప్ వేరియంట్లు.
ఈవీ మ్యాక్స్ డార్క్ లాంచింగ్ సందర్భంగా టాటా ప్యాసెంజర్ ఎక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ మార్కెటింగ్, సేల్స్ అండ్ సర్వీస్ స్ట్రాటజీ హెడ్ వివేక్ శ్రీవత్స మాట్లాడుతూ.. నెక్సాన్ ఈవీ దేశంలోనే నంబర్ ఎలక్ట్రిక్ వెహికల్ అని, అతి తక్కువ సమయంలోనే 50 వేల మంది వినియోగదారుల అభిమానాన్ని సొంతం చేసుకున్నట్టు చెప్పారు. కస్టమర్లకు అది అత్యుత్తమ అవకాశంగా మారిందని పేర్కొన్నారు. ‘డార్క్’ సాధించిన విజయం, నెక్సాన్ ఈవీ మ్యాక్స్ సొంతం చేసుకున్న జనాదరణకు ఆనందంగా ఉందన్నారు.
ఫీచర్లు: నెక్సాన్ మ్యాక్స్ డార్క్ లైనప్‌లో హార్మాన్ ద్వారా 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, స్లిక్ రెస్పాన్స్‌తో హై రిజల్యూషన్ (1920X720) హై డెఫినిషన్ (HD) డిస్ప్లే, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే కనెక్టివిటీ, హెచ్డీ రియర్ వ్యూ కెమెరా ఉన్నాయి. డార్క్ రేంజ్లో కూడా ఆరు ప్రాంతీయ భాషల్లో వాయిస్ అసిస్టెంట్ అందుబాటులో ఉంది. అలాగే, ఇంగ్లిష్, హిందీ, బెంగాలీ, తమిళ్, తెలుగు, మరాఠీలో 180కిపైగా వాయిస్ కమాండ్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే, కొత్త యూజర్ ఇంటర్ఫేస్ (UI) వంటి ఉన్నతమైన హైటెక్ ఇన్ఫోటైన్మెంట్ అప్‌గ్రేడ్ అందుబాటులో ఉంది.