Twitter: త్వరలోనే ‘ట్విటర్ బర్డ్’ కనుమరుగు!.. ఎలాన్ మస్క్ ఇంట్రెస్టింగ్ ట్వీట్స్...

ABN , First Publish Date - 2023-07-23T15:41:56+05:30 IST

చైనాకు చెందిన యాప్ ‘వీ చాట్’ (We Chat) మాదిరిగానే సూపర్ యాప్‌ను రూపొందించాలని ఎలాన్ మస్క్ యోచిస్తున్నారు. ‘‘మనం త్వరలోనే ట్విటర్ బ్రాండ్‌కు గుడ్‌బై చెప్పాలి. క్రమంగా పక్షులన్నింటికి కూడా. ఈ రోజు రాత్రికే ఎక్స్ లోగో అందుబాటులోకి వస్తే.. రేపే ప్రపంచవ్యాప్తంగా ఈ లోగో లైవ్‌లోకి వస్తుంది’’ అంటూ మస్క్ ట్వీట్ చేశారు.

Twitter: త్వరలోనే ‘ట్విటర్ బర్డ్’ కనుమరుగు!.. ఎలాన్ మస్క్ ఇంట్రెస్టింగ్ ట్వీట్స్...

న్యూఢిల్లీ: ట్విట్టర్ (twitter) అధిపతి ఎలాన్ మస్క్ (Elon musk) ఊహించని బాంబు పేల్చారు. ట్విటర్ ప్లాట్‌ఫామ్‌ బ్రాండ్ మార్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ప్రకటించారు. చైనాకు చెందిన యాప్ ‘వీ చాట్’ (We Chat) మాదిరిగానే సూపర్ యాప్‌ను రూపొందించాలని ఆయన యోచిస్తున్నారు. ‘‘మనం త్వరలోనే ట్విటర్ బ్రాండ్‌కు గుడ్‌బై చెప్పేందుకు ప్రయత్నించాలి. క్రమంగా పక్షులన్నింటికి కూడా. ఈ రోజు రాత్రికే తగిన ఎక్స్ లోగో అందుబాటులోకి వస్తే.. రేపే ప్రపంచవ్యాప్తంగా ఈ లోగో లైవ్‌లోకి వస్తుంది’’ అంటూ మస్క్ ట్వీట్ చేశారు. ఎక్స్ లోగో ఏవిధంగా ఉండాలనుకుంటున్న వెర్షన్ లోగోను కూడా ఆయన పోస్ట్ చేశారు.

దీంతో త్వరలోనే ట్విటర్ పక్షి కనుమరుగవనుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుత లోగో, బ్లూ బర్డ్ తమ గుర్తింపు అసెట్ అని, అందుకే దీనిని మేము కాపాడుకుంటామని ట్విటర్ వెబ్‌సైట్ పేర్కొంది. కాగా ‘ఎక్స్’ పేరు విషయం కొంతకాలంగా ఎలాన్ మస్క్ మనసులో ఉందని తెలుస్తోంది. ఇదిలావుండగా ఎలాన్ మస్క్ గతేడాది ఏకంగా 44 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను కొనుగోలు చేశారు. ఎక్స్ కార్ప్ కంపెనీలో దీనిని విలీనం చేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-07-23T15:48:39+05:30 IST