Zomato CEO: జొమాటో సీఈవో దీపేందర్ గోయల్ నిబద్ధతకు నిదర్శన ఇదీ.. ఏకంగా మూడేళ్లపాటు...

ABN , First Publish Date - 2023-03-03T18:08:33+05:30 IST

ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ ‘జొమాటో’ (Zomato) వ్యవస్థాపకుడు దీపేందర్ గోయల్ (Deepinder Goyal) పట్టుదల ఉన్న మనిషి... అందుకు నిదర్శనమైన ఓ ఘటన తాజాగా వెలుగుచూసింది. అదేంటంటే..

Zomato CEO: జొమాటో సీఈవో దీపేందర్ గోయల్ నిబద్ధతకు నిదర్శన ఇదీ.. ఏకంగా మూడేళ్లపాటు...

న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ ‘జొమాటో’ (Zomato) వ్యవస్థాపకుడు దీపేందర్ గోయల్ (Deepinder Goyal) పట్టుదల ఉన్న మనిషి. 2010లో స్థాపించిన నాటి నుంచి జొమాటో అప్పులబాటలోనే పయణిస్తున్నా.. ఎంతో ఓపికతో కంపెనీని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే దానిని ట్రాక్‌లోకి తీసుకొస్తున్నారు. కాగా కంపెనీని వృద్ధిబాట పట్టించే క్రమంలో సీఈవో దీపేందర్ గోయల్ (Deepinder Goyel) వ్యక్తిగత త్యాగాలకు సైతం వెనుకాడడంలేదని నిరూపించే ఓ విషయం వెలుగుచూసింది. వ్యవస్థాపకుడిగా, సీఈవోగా దశాబ్ధానికిపైగా విశేషానుభవం ఉన్న ఆయన మూడేళ్లపాటు జీతాన్ని వదులుకున్నారు. ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది. వచ్చే మూడేళ్లు అంటే ఆర్థిక సంవత్సరం 2024 వరకు జీతం తీసుకోకూడదని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలిపింది. ఏప్రిల్ 1, 2021 నుంచి మూడేళ్లపాటు జీతాన్ని వదులుకోవాలని దీపేందర్ గోయల్ నిర్ణయించినట్టు జొమాటో ఐపీవో (Zomato IPO) డీహెచ్‌ఆర్‌పీ (DHRP) ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది. ఎండీగా, సీఈవోగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ 36 నెలలపాటు జీతాన్ని వదులుకోవాలని నిర్ణయించారని కంపెనీ వెల్లడించింది. ఎండీగా, సీఈవోగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ 36 నెలలపాటు జీతాన్ని వదులుకోవాలని నిర్ణయించారని కంపెనీ తెలిపింది.

కాగా మార్చి 31, 2022తో ముగిసిన అర్ధసంవత్సరానికిగానూ జీతాలు, ఈఎస్‌వోపీ(ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్) వంటి ఇతర ప్రయోజనాల కోసం మొత్తం రూ.778 కోట్లు కంపెనీ వెచ్చించింది. గతేడాది ఇదే జూన్ కాలంలో రూ387 కోట్లు కంపెనీ చెల్లించింది. అంతేకాకుండా రూ.700 కోట్ల విలువైన ఈఎస్‌వోపీలను జొమాటో ఫ్యూచర్ ఫౌండేషన్‌కు విరాళం ఇవ్వాలని నిర్ణయించారు. ఇక సీఈవోగా కొనసాగుతున్నప్పటికీ మార్చి 31, 2022తో ముగిసిన సంవత్సరానికి తన శాలరీని వదలుకున్నారు. జొమాటో(Zomato)లో దీపేందర్ గోయల్‌కు 5.5 శాతం వాటా ఉంది. ఆర్థిక సంవత్సరం 2021లో ఆయన బేసిక్ శాలరీ ఏడాదికి రూ.3.5 కోట్లుగా ఉంది. కానీ కొవిడ్ (Covid-19) కారణంగా తన జీతంలో కోత విధించుకుని రూ.1.96 కోట్లకు తగ్గించుకున్నారు.

ఇవి కూడా చదవండి..

హరిహరకృష్ణ పారిపోకుండా కాళ్లకు బేడీలు..

హరీష్ హత్యపై నోరువిప్పిన తల్లి.. అసలేం జరిగిందో చెప్పేసింది!

Updated Date - 2023-03-03T18:09:45+05:30 IST