దారుణం: భార్య మీద కోపంతో ఈ వ్యక్తి ఎంత పని చేశాడో చూడండి..

ABN , First Publish Date - 2023-07-08T13:52:53+05:30 IST

రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్య మీద కోపంతో ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలను బావిలోకి తోసేశాడు. దీంతో 5 ఏళ్ల బాలుడు చనిపోగా.. 9 ఏళ్ల బాలికను గ్రామస్థులు రక్షించారు. దీంతో తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

దారుణం: భార్య మీద కోపంతో ఈ వ్యక్తి ఎంత పని చేశాడో చూడండి..

రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో (Rajasthan's Ajmer district) దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్య మీద కోపంతో ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలను బావిలోకి తోసేశాడు. దీంతో 5 ఏళ్ల బాలుడు చనిపోగా.. 9 ఏళ్ల బాలికను గ్రామస్థులు రక్షించారు. దీంతో తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 35 ఏళ్ల వయసున్న ఆకాష్ అలియాస్ విజయ్ కాంత్ (Akash alias Vijay Rawat) అనే వ్యక్తి కుటుంబంతో కలిసి అజ్మీర్ జిల్లాలో గల హతిఖేడా గ్రామంలో నివసిస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. పిల్లల పేర్లు హర్షిత, హర్షవర్దన్. హర్షిత(Harshita) వయసు 9 సంవత్సరాలు కాగా, హర్షవర్దన్(Harshvardhan) వయసు 5 సంవత్సరాలు.

అయితే ఇటీవల ఆకాష్‌కు అతని భార్యతో గొడవ జరిగింది. ఈ గొడవ కాస్త పెద్దదై భార్యభర్తల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం నెలకొంది. దీంతో సహనం కోల్పోయిన ఆకాష్.. భార్య మీద కోపంతో తమ పిల్లలిద్దరిని ఊర్లో ఉన్న ఓ బావిలోకి తోసేశాడు. ఇది గమనించిన గ్రామస్థులు వెంటనే బావిలోకి దూకి పిల్లలిద్దరిని రక్షించే ప్రయత్నం చేశారు. కానీ దురదృష్టవశాత్తు 5 ఏళ్ల బాలుడు హర్షవర్దన్ చనిపోయాడు. 9 ఏళ్ల బాలిక హర్షితను మాత్రమే రక్షించగలిగారు.

విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ‘‘ఆకాష్ అలియాస్ విజయ్ రావత్ తన భార్యతో గొడవపడ్డాడు. దీంతో సహనం కోల్పోయి తన పిల్లలిద్దరిని బావిలోకి తోసేశాడు. గ్రామస్థులు పిల్లలను రక్షించారు. కానీ అప్పటికే 5 ఏళ్ల బాలుడు చనిపోయాడు. 9 ఏళ్ల బాలిక మాత్రం ప్రాణాలతో బయటపడింది. ప్రస్తుతం పిల్లల తండ్రి ఆకాష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. త్వరలోనే కేసు నమోదు చేసి, న్యాయ పరంగా శిక్ష పడేలా చేస్తాం’’ అని స్థానిక ఎస్‌హెచ్‌వో ధరమ్‌వీర్‌ సింగ్‌ తెలిపారు.

Updated Date - 2023-07-08T16:51:41+05:30 IST