Hyderabad : నీలి చిత్రాల్లో నటిస్తే లక్షలు ఇస్తామని.. వివాహితను హోటల్‌కు పిలిపించి..!

ABN , First Publish Date - 2023-08-05T12:16:29+05:30 IST

లక్షలిస్తామని ఆశచూపాడు.. విశాఖపట్నం (Visakhapatnam) నుంచి హైదరాబాద్ (Hyderabad) తీసుకొచ్చాడు..! నీలి చిత్రాల్లో (Obscene Videos) నటించాలని చెప్పాడు.. ఆర్థిక అవసరాల రీత్యా వివాహిత సరేనని చెప్పింది..!

Hyderabad : నీలి చిత్రాల్లో నటిస్తే లక్షలు ఇస్తామని.. వివాహితను హోటల్‌కు పిలిపించి..!

లక్షలిస్తామని ఆశచూపాడు.. విశాఖపట్నం (Visakhapatnam) నుంచి హైదరాబాద్ (Hyderabad) తీసుకొచ్చాడు..! నీలి చిత్రాల్లో (Obscene Videos) నటించాలని చెప్పాడు.. ఆర్థిక అవసరాల రీత్యా వివాహిత సరేనని చెప్పింది..! తీరాచూస్తే.. ఆమెకు మత్తుమందిచ్చి వీడియోలు చిత్రీకరించి.. బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు దుండగులు. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.


Panjagutta-Police-Station.jpg

ఏం జరిగిందంటే..?

నీలి చిత్రాల్లో నటిస్తే లక్షలు వస్తాయని ఓ కేటుగాడు వివాహితన మోసం చేశాడు. నాలుగేళ్ల క్రితం ఓ కార్యక్రమంలో విశాఖపట్నంకు చెందిన వివాహిత.. బోనాల చెన్నకేశవ అనే వ్యక్తికి పరిచయం అయ్యింది. ఇదిగో ఫలానా పనిచేస్తే లక్షల్లో డబ్బులు వస్తాయని ఆశచూపాడు. ఆమె మొదట ఒప్పుకోనప్పటికీ బలవంతంగా ఒప్పించాడు. ఎన్నిరోజులు ఇలా కూలి పనులు చేయడం.. నీలి చిత్రాల్లో నటిస్తే లక్షలొస్తాయని మాయ మాటలు చెప్పాడు. వెబ్‌సైట్ వాళ్లు తనకు బాగా తెలుసని.. ముఖానికి స్కార్ప్ కట్టుకుని నటిస్తే పది లక్షలు ఇస్తారని నిందితుడు బలవంతం చేశాడు.

ఆర్థిక అవసరాల రీత్యా నీలిచిత్రాల్లో నటించాడానికి సరేనని చెప్పింది ఆ వివాహిత. దీంతో నగరంలోని పంజాగుట్టలో ఉన్న ఓ ప్రముఖహోటల్‌కు పిలిపించాడు చెన్నకేశవ. ఆమెతో కాసేపు మాట్లాడిన దుండగుడు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. ఆమె మత్తులోకి జారుకున్నాక నగ్నంగా వీడియోలు తీశాడు దుర్మార్గుడు. మత్తు నుంచి తేరుకున్నాక ఆ వీడియోలను చూపించి వివాహితనే నిందితుడు బ్లాక్ మెయిల్ చేశాడు. డబ్బులు డిమాండ్ చేయడం, పదే పదే ఫోన్ చేసి వేధిస్తుండటంతో పంజాగుట్టలోని పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. గత కొన్నిరోజులుగా బాధితురాలు దిల్‌సుఖ్‌నగర్‌లో నివాసం ఉంటోంది. వివాహ వేడుకల ఏర్పాట్లు చేసుకుంటూ వివాహిత జీవనోపాధి పొందుతున్నట్లు తెలియవచ్చింది.

Updated Date - 2023-08-05T12:16:29+05:30 IST