Share News

Hyderabad: ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి మహిళ చిత్రాలు డౌన్‌లోడ్‌ చేసి...

ABN , Publish Date - Dec 15 , 2023 | 10:59 AM

ఇన్‌స్టాగ్రామ్‌(Instagram) నుంచి మహిళ చిత్రాలు డౌన్‌లోడ్‌ చేసి, వాటిని అశ్లీల చిత్రాలుగా మార్చి సోషల్‌ మీడియా(Social media)లో

Hyderabad: ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి మహిళ చిత్రాలు డౌన్‌లోడ్‌ చేసి...

- మహిళల చిత్రాలు మార్ఫింగ్‌ చేసి.. బ్లాక్‌మెయిల్‌

- సైబర్‌ నేరగాడి అరెస్ట్‌

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): ఇన్‌స్టాగ్రామ్‌(Instagram) నుంచి మహిళ చిత్రాలు డౌన్‌లోడ్‌ చేసి, వాటిని అశ్లీల చిత్రాలుగా మార్చి సోషల్‌ మీడియా(Social media)లో పెడతానని బెదిరిస్తూ బ్లాకమెయిల్‌ చేస్తున్న సైబర్‌ నేరగాడి ఆటకట్టించారు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు. క్రైమ్స్‌ జా యింట్‌ సీపీ గజరావ్‌భూపాల్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హుస్సేనీ ఆలం ప్రాంతానికి చెందిన మనీష్‌ వర్మ చెడు వ్యసనాలకు బానసయ్యాడు. అడ్డదారిలో డబ్బు సంపాదించాలని పథకం వేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో మహిళల ఖాతాలను సెర్చ్‌ చేసేవాడు. కొంతమంది మహిళలు ఇన్‌స్టాగ్రామ్‌లలో వారు అప్‌లోడ్‌ చేసిన ఫొటోలను డౌన్‌లోడ్‌ చేసుకునేవాడు. వాటిని వివిధ అప్లికేషన్స్‌ సహకారంతో మార్ఫిం గ్‌ చేసి అశ్లీల చిత్రాలుగా మార్చేవాడు. తర్వాత ఆ చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా సదరు మహిళలకు పంపేవాడు. అడినంత డబ్బు ఇవ్వకపోతే ఫొటోలను సోషల్‌మీడియాలో అందరికీ షేర్‌ చేస్తానని, అశ్లీల చిత్రాల వెబ్‌సైట్లలో పోస్టు చేస్తానని బెదించేవాడు. అతడి వేధింపులు భరించలేక ఓ బాధితురాలు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్‌స్పెక్టర్‌ పద్మ టీమ్‌ సాంకేతిక ఆధారాలు సేకరించి నిందితుడిని గురువారం అరెస్ట్‌ చేసింది.

Updated Date - Dec 15 , 2023 | 10:59 AM