Crime: పనికి వెళ్లి తిరిగొచ్చిన 15 ఏళ్ల కుమార్తె.. ఇంటి తలుపులు తీయగానే తండ్రి చేసిన నిర్వాకం చూసి..!
ABN , First Publish Date - 2023-06-13T17:31:16+05:30 IST
ఈ లోకంలో తల్లిదండ్రులు.. పిల్లల మధ్య ఉండే అనుబంధం చాలా అపురూపమైనది. ఏ పిల్లలైనా తండ్రి చాటునో.. తల్లి చాటునో పెరిగిన వాళ్లే. ఏ కష్టమొచ్చినా.. ఏ బాధవచ్చినా ముందుగా తల్లిదండ్రులకే చెప్పుకుంటాం. కొంత మంది తల్లిదండ్రులు.. పిల్లలు అడగకుండానే
ఈ లోకంలో తల్లిదండ్రులు.. పిల్లల మధ్య ఉండే అనుబంధం చాలా అపురూపమైనది. ఏ పిల్లలైనా తండ్రి చాటునో.. తల్లి చాటునో పెరిగిన వాళ్లే. ఏ కష్టమొచ్చినా.. ఏ బాధవచ్చినా ముందుగా తల్లిదండ్రులకే చెప్పుకుంటాం. కొంత మంది తల్లిదండ్రులు.. పిల్లలు అడగకుండానే అన్ని తీసుకొస్తుంటారు. మరికొందరు పిల్లలు ఆడిగితే ఇస్తుంటారు. లేదంటే తెస్తుంటారు. ఇంకొక విషయం ఏంటంటే పిల్లలు అడిగితే ఏ తండ్రి కూడా కాదనడు. కానీ ఆ బిడ్డ నోరారా అడగడమే శాపమైంది. అసలు ఇంతకీ ఏమైంది? ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
ఓ కొడుకు (son) తన తండ్రిని (Father) పది రూపాయలు కావాలని అడిగాడు. ఆ మాటే నేరమైంది. డబ్బులు అడిగిన పాపానికి మద్యం మత్తులో ఉన్న ఆ తండ్రి ఆవేశానికి గురయ్యాడు. విచక్షణ మరిచి అత్యంత దారుణంగా కొట్టి చంపాడు. ఈ అమానవీయ సంఘటన జార్ఖండ్‌లో (jharkhand) చోటుచేసుకుంది.
జార్ఖండ్ ఛత్రా జిల్లాలోని కరేలీబర్ గ్రామంలో బిలేశ్ భుయాన్, భార్య, 15 ఏళ్ల కుమార్తె, 12 ఏళ్ల కుమారుడు పప్పు కుమార్‌తో కలిసి జీవనం సాగిస్తున్నాడు. కూలి పనులు చేస్తూ బిలేశ్ కుటుంబాన్ని పోషించేవాడు. మద్యం సేవించే అలవాటు ఉన్న బిలేశ్, అతని భార్య సోమవారం ఉదయమే ఫుల్‌గా మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న దంపతులిద్దరూ వాదులాడుకుంటున్నారు. సరిగ్గా అదే సమయానికి కుమారుడు పప్పు కుమార్ తండ్రి వద్దకు వచ్చి నాన్నా పది రూపాయలు కావాలని అడిగాడు. అప్పటికే అతడు తీవ్ర కోపంతో రగిలిపోతున్న భుయాన్ మరింత ఆగ్రహంతో కుమారుడిని ఊపిరాడకుండా చేసి చంపేశాడు.
ఇప్పుడే పనిలో నుంచి ఇంటికొచ్చిన కూతురు... తమ్ముడు అచేతనంగా పడి ఉండటాన్ని చూపి పెద్ద కేకలు వేసింది. దీంతో ఇరుగుపొరుగు వారు వచ్చి చూడగా బాలుడు పప్పు విగతజీవిగా పడివున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాలుడి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి తండ్రిని అరెస్ట్ చేశారు. అసలు పప్పు తన తండ్రిని రూ.10 ఎందుకోసం (ten rupees) అడిగాడో తెలియదు. ఆ సమాచారం నిందితుడి నుంచి పోలీసులు రాబట్టాలి.