Minister Udayanidhi: మంత్రి ఉదయనిధిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత అరెస్ట్
ABN , First Publish Date - 2023-11-24T13:37:08+05:30 IST
మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi)పై వాట్సాప్‌లో అనుచిత వ్యాఖ్యలు పోస్ట్ చేసిన బీజేపీ(BJP) నాయకుడిని పోలీసులు
పెరంబూర్(చెన్నై): మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi)పై వాట్సాప్‌లో అనుచిత వ్యాఖ్యలు పోస్ట్ చేసిన బీజేపీ(BJP) నాయకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తూత్తుకుడి జిల్లా సాత్తాన్‌కుళం మాణిక్యవాసపురం వీధికి చెందిన ఎడ్వర్డ్ రాజదురై మైనార్టీ మార్చా విభాగ జిల్లా మాజీ కార్యదర్శి. ఆయన నడుపుతు న్న వాట్సాప్ గ్రూప్‌లో ఈనెల 21న మంత్రి ఉదయనిధిని అసభ్యంగా దూషిస్తూ ఆడియో పోస్ట్ చేశారు. ఈ వ్యవహారంపై డీఎంకే నేతల ఫిర్యాదు మేరకు అసభ్య ధూషణ, ప్రభుత్వానికి కళంకం తెచ్చేలా వ్యాఖ్యల వ్యాప్తి, ప్రజా శాంతి భంగం సహా 4 సెక్షన్ల కింద కేసు సాత్తాన్‌కుళం పోలీసులు నమోదు చేసి ఎడ్వర్ట్ రాజదురైను అరెస్ట్ చేసేందుకు యత్నించగా, ఆయనకు గుండెనొప్పి రావడంతో తిరునల్వేలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్సలు ముగిసిన తర్వాత ఆయన్ను జైలుకు తరలిస్తామని పోలీసులు తెలిపారు.