Apsara Murder Case : శంషాబాద్ అప్సర హత్యకేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి.. పిన్ టూ పిన్ వివరాలు ఇవే..!
ABN , First Publish Date - 2023-06-09T16:41:36+05:30 IST
హైదరాబాద్‌లో (Hyderabad) సంచలనం సృష్టించిన అప్సర హత్యకేసులో (Apsara Murder Case) విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో తవ్వేకొద్దీ సంచలన విషయాలు బయటికొస్తున్నాయి..
హైదరాబాద్‌లో (Hyderabad) సంచలనం సృష్టించిన అప్సర హత్యకేసులో (Apsara Murder Case) విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో తవ్వేకొద్దీ సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. ఇప్పటికే పూజారి సాయికృష్ణ- అప్సర గురించి పలు విషయాలు వెలుగులోకి రాగా తాజాగా అప్సర తల్లి, ఇంటి యజమాని, సాయికృష్ణ తండ్రి, సాయికృష్ణ మీడియాతో మాట్లాడారు. దీంతో అసలు ఎవరు చెప్పేది నిజం..? ఎవరు అబద్ధం చెబుతున్నారు..? అనే విషయాలు అర్థం కాని పరిస్థితి. ఇవన్నీ అటుంచితే.. గర్భం దాల్చిన అప్సరను హత్య చేయడం దారుణాతి దారుణమని సాయికృష్ణను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ జనాల నుంచి వస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన విషయాలేంటి..? ఎవరెవరు ఏం మాట్లాడారు..? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం..
అసలేం జరిగింది..?
సాయికృష్ణ పూజారి.. నగరంలోని సరూర్‌నగర్ ప్రాంతానికి చెందిన ఈయనకు అప్సర అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఒకే కాలనీలో ఉంటున్నారు. గుడికి వెళ్తూ వస్తుండగా ఈ ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడగా.. అది కాస్త వివాహేతర సంబంధం దాగా వెళ్లింది. సాయికృష్ణకు పెళ్లయ్యింది.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే తనను పెళ్లి చేసుకోవాలని సాయిపై అప్సర ఒత్తిడి తెస్తూ వచ్చింది. దీంతో కోప్రోదిక్తుడైన సాయి.. బయటికెళ్దామని చెప్పి ఇద్దరూ కారులో శంషాబాద్‌లోని సుల్తాన్‌పల్లికి వెళ్లారు. కోయంబత్తూరు వెళ్తున్నట్లు చెప్పి అప్సర.. సాయికృష్ణ దగ్గరికెళ్లింది. అక్కడికి వెళ్లాక కూడా పెళ్లి ప్రస్తావన రావడంతో ఆగ్రహంతో రగిలిపోయిన సాయికృష్ణ.. అప్సర తలపై బండరాయితో హత్యచేసి మళ్లీ అదే కారులో తీసుకొచ్చి స్థానికంగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వద్ద మ్యాన్‌హోల్‌లో పడేశాడు. అనంతరం తనకేమీ తెలియదన్నట్లుగా తన సమీప బంధువు అప్సర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు సాయి సెల్‌ఫోన్ సిగ్నల్స్, సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేయగా.. సాయికృష్ణే నిందితుడని పోలీసులు తేల్చారు. నిందితుడిని అదుపులోనికి తీసుకున్న పోలీసులు మరోవైపు.. మ్యాన్‌హోల్‌లో ఉన్న మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. అయితే ఈ ఘటనపై ఇప్పుడిప్పుడే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.
మా అబ్బాయే హత్య చేశాడని అనుకోవట్లేదు..!
‘ మా అబ్బాయి చాలా మంచివాడు. దైవసేవ తప్ప వేరే ఆలోచన ఉండేది కాదు. అప్సర-సాయికృష్ణ మధ్య ఏం జరిగిందో తెలియదు. ఏం జరిగినా మా అబ్బాయి అలా చేసి ఉండకూడదు. అప్సరతో మా అబ్బాయి వివాహేతర సంబంధం గురించి నాకు తెలియదు. ఈ అమ్మాయి నిత్యం గుడికి వస్తున్నట్లు, కాస్త ఎక్కువగా మా అబ్బాయితో మాట్లాడుతున్నట్లు తెలిసి జాగ్రత్తగా ఉండమని చెప్పాను. వివాహేతర సంబంధం ఉంటేనే అప్సరను బయటికి తీసుకువెళ్లాలా.?. ఏం జరిగిందో ఏంటో మా అబ్బాయి చెప్పాలి.. నాకైతే తెలియదు. మా అబ్బాయితో అప్సర క్లోజ్‌గా ఉండేది. అమ్మాయి విషయంలో జాగ్రత్తగా ఉండమని మా అబ్బాయికి నేను చెప్పాను. అప్సర మా అబ్బాయిని తీవ్రంగా బలవంత పెట్టింది. అప్సర విషయం.. మా అబ్బాయి ముందుగానే మాకు చెప్పి ఉంటే పెద్దలతో పంచాయితీ పెట్టేవాళ్ళం.. లేదా పోలీస్ స్టేషన్‌లో అప్సరకు కౌన్సిలింగ్ ఇప్పించే వాళ్ళం. మా అబ్బాయి తప్పు చేస్తే చట్ట ప్రకారం ఏ చర్యలు అయినా తీసుకోవచ్చు. మూడో తేదీన ఆలస్యంగా సాయి ఇంటికి వచ్చాడు. ఈ మధ్య నిత్యాన్నదాన కార్యక్రమంలో భాగంగా సాయి బిజిగా ఉంటున్నాడు. కాబట్టి పట్టించుకోలేదు. అప్సర గతంలో సినిమాల్లో నటించిందని తెలిసింది. ఆమె గత చరిత్ర కూడా తెలుసుకోవాలి. మా అబ్బాయే హత్య చేసాడని నేను అనుకోవట్లేదు’ అని సాయికృష్ణ తండ్రి ఏబీఎన్-ఆంధ్రజ్యోతికి వివరించాడు.
అప్సర తల్లి ఏమన్నారంటే..
‘మా అమ్మాయికి గుడిలోనే సాయికృష్ణ పరిచయం అయ్యాడు. ఇంటికి వచ్చేవాడు. నన్ను అత్తయ్య అని పిలిచేవాడు. మా అయన కాశీలో ఉంటారు. సాయికృష్ణ తరచూ ఇంటికి వచ్చి కలుపుగోలుగా ఉండేవాడు. రెండు దశాబ్దాల క్రితం చెన్నై లో ఉండేవాళ్ళం! అప్పట్లో సినిమాల్లో అప్సర నటించిన విషయం వాస్తవమే!. సాయి కుటుంబంతో మాకు ఎలాంటి బందుత్వము లేదు. ఆదివారం నాడు సాయి మా ఇంటికి వచ్చాడు. అప్సరను భద్రాచలం పంపించామని నాతో చెప్పాడు. పాప కనపడట్లేదు అని అడిగితే.. నన్నే అనుమానిస్తున్నారా అని అన్నాడు. అలాంటిది ఏమీ లేదని చెప్పాడు. గుడి దగ్గరే మా అమ్మాయితో పరిచయం ఏర్పడింది. నాతో కోయంబత్తూరు వెళ్తున్నట్లు అప్సర చెప్పింది. పూజారి అయ్యుండి ఇలా చేస్తాడని ఊహించలేదు. పెళ్లి చేసుకోవాలని మా కూతురు ఒత్తిడి చేశారన్నది పచ్చి అబద్ధం. !’ అని అప్సర తల్లి మీడియాకు తెలిపారు.
ఇంటి యజమాని ఇలా..
‘అప్సరను బైక్‌పై తరచూ తీసుకెళ్లేవాడు. దాదాపు ప్రతి రోజూ సాయికృష్ణ ఇంటికి వస్తుండటం చూశాం’ అని అప్సర ఉంటున్న ఇంటి యజమాని చెప్పాడు.
సాయికృష్ణ ఇలా..!
'గర్భం దాల్చింది అందుకు నేనే కారణమని పెళ్ళిచేసుకోవాలని ఒత్తిడి చేసింది. కానీ ఆమె వేరేవాళ్లతో కూడా సన్నిహితంగా ఉండేది. ఇవన్నీ భరించలేకే హత్య చేశాను’ అని పోలీసుల విచారణలో సాయికృష్ణ వెల్లడించాడు. ఆ తర్వాత ఘటనాస్థలానికి పోలీసులు తీసుకెళ్లి మృతదేహాన్ని గుర్తించారు.
షాకింగ్ విషయం ఏమిటంటే..
ఇదిలా ఉంటే.. అప్సర హత్య కేసులో పోస్టుమార్టం రిపోర్టు కీలకం కానున్నది. గర్భవతిగా ఉన్న అప్సరను సాయికృష్ణ తాజాగా విస్తుపోయే విషయం వెలుగుచూసింది. అప్సర గర్భంపై ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. మొదటిసారి అప్సర గర్భవతి అయినప్పుడు సాయికృష్ణ అబార్షన్ చేయించాడు. అయితే రెండోసారి కూడా అప్సర గర్భం దాల్చింది. గర్భం పైనే వివాదం జరిగినట్లు పోలీసులు అనుమనిస్తున్నారు. అప్సర పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. నగరంలోని ఉస్మానియా ఆస్పత్రిలో అప్సర మృత దేహానికి పోస్టుమార్టం జరగనుంది.