Tragic Incident: ప్రభుత్వ ఉద్యోగం సాధించిన ఈ యువతికి సన్మానం కూడా జరిగింది.. కానీ విషాదం ఏంటంటే..

ABN , First Publish Date - 2023-06-21T11:01:08+05:30 IST

పుణెలోని రాజ్‌గఢ్ కోట స్థావరంలో 26 ఏళ్ల యువతి మృత దేహం కుళ్లిపోయిన స్థితిలో లభ్యం కావడం కలకలం రేపింది. దీంతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. యువతితో పాటు కోట వద్దకు వచ్చిన వ్యక్తి ఈ హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. చనిపోయిన యువతి దర్శన దత్తాత్రేయ పవార్‌గా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

Tragic Incident: ప్రభుత్వ ఉద్యోగం సాధించిన ఈ యువతికి సన్మానం కూడా జరిగింది.. కానీ విషాదం ఏంటంటే..

మహారాష్ట్ర: పుణెలోని రాజ్‌గఢ్ కోట స్థావరంలో 26 ఏళ్ల యువతి మృత దేహం కుళ్లిపోయిన స్థితిలో లభ్యం కావడం కలకలం రేపింది. దీంతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. యువతితో పాటు కోట వద్దకు వచ్చిన వ్యక్తి ఈ హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. చనిపోయిన యువతి దర్శన దత్తాత్రేయ పవార్‌గా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దర్శన కనిపించడం లేదని ఇటీవలే ఆమె తండ్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశాడు. కాగా దర్శన మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) పోటీ పరీక్ష రాసి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌గా (RFO) మూడో ర్యాంక్ సాధించింది. రాజ్‌గఢ్ కోట వద్ద కుళ్లిపోయిన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ మనోజ్‌ పవార్‌, కానిస్టేబుల్‌ ఔండుబర్‌ అడ్వాల్‌, జ్ఞానదీప్‌ ధివార్‌, యోగేశ్‌ జాదవ్‌ ఇతర పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లారు. స్థానికుల సాయంతో పోలీసులు యువతి మృతదేహాన్ని వెలికితీశారు.

12d7fe73-00f0-4d9e-b93d-7ce49d0f8b89.jpg

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎంపీఎస్సీ పరీక్షలో మంచి ర్యాంకు సాధించినందుకు దర్శనను ఇటీవల ఓ ప్రైవేట్ సంస్థ సన్మానించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దర్శన పుణె వెళ్లింది. జూన్ 10వ తేదీన తిలక్ రోడ్డులోని న్యూ ఇంగ్లీషు స్కూల్‌ సమీపంలో ఉన్న గణేష్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. అయితే ఈ కార్యక్రమం తర్వాత ఎన్నిసార్లు ఫోన్‌ చేసిన దర్శన స్పందించలేదని తల్లిదండ్రులు తెలిపారు. జూన్ 12న తల్లిదండ్రులు సంబంధిత సంస్థలో విచారించగా.. కార్యక్రమం అనంతరం దర్శన వెళ్లిపోయిందని చెప్పారు. దీంతో ఆమె తండ్రి జూన్ 12న సింహగడ్ రోడ్డులోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. రాయ్‌గఢ్ కోట వద్ద మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. దర్శన తండ్రి మొబైల్ ద్వారా మృతదేహాన్ని దర్శనదేనని నిర్ధారించుకున్నారు. అలాగే మృతదేహానికి సమీపంలోనే దర్శన చెప్పులు కూడా కనిపించాయి.

medium_2023-06-19-3a2f7226cb.jpg

స్నేహితులు, బంధువులను విచారించగా.. రాహుల్ దత్తాత్రే హండోరే అనే వ్యక్తితో కలిసి దర్శన సింహగఢ్, రాజ్‌గఢ్ కోటలను సందర్శించడానికి వెళ్లినట్లు తేలింది. అయితే ఈ ఘటన తర్వాత రాహుల్ కూడా కనిపించకుండా పోవడం హత్య చేసి ఉండొచ్చనే అనుమానాలకు కారణమైంది. అయితే దర్శన మృత దేహానికి సమీపంలోనే ఓ యువకుడి జాకెట్ కనిపించింది. దర్శన మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దర్శన మృతికి గల కారణాలను, రాహుల్ మిస్సింగ్ విషయాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Updated Date - 2023-06-21T11:01:08+05:30 IST