Whatsapp: ఓ మహిళ వాట్సప్ డీపీతో వీడిన మిస్టరీ.. రూ.60 లక్షల చోరీ కేసును చిటికెలో తేల్చేసిన పోలీసులు..!
ABN , First Publish Date - 2023-05-20T16:59:43+05:30 IST
నేరస్తులు ఎంత తెలివిగా తప్పించుకోవడానికి ప్లాన్ వేసినా ఇక్కడో చోట చిన్న క్లూ విడిచిపెడతారు. దానితో నిందితుల్ని పట్టుకుంటారు పోలీసులు. తాజాగా
నేరస్తులు ఎంత తెలివిగా తప్పించుకోవడానికి ప్లాన్ వేసినా ఇక్కడో చోట చిన్న క్లూ విడిచిపెడతారు. దానితో నిందితుల్ని పట్టుకుంటారు పోలీసులు. తాజాగా బయటపడిన ఓ కేసు మిస్టరీ తెలిస్తే అవ్వాక్కవ్వాల్సిందే.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని టీటీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డాక్టర్ భూపేంద్ర శ్రీవాస్తవ తన ఇంట్లో విలువైన నగలు చోరీకి గురయ్యాయని పోలీసులు ఫిర్యాదు చేశారు. షాజహానాబాద్ ప్రాంతంలో భూపేంద్రకు ప్రైవేట్ ఆస్పత్రి ఉంది. అయితే కొన్ని రోజులుగా తన ఇంట్లో విలువైన ఆభరణాలు, డబ్బు చోరీకి (theft) గురవుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు. 20 రోజుల క్రితం దొంగతనం చేశారన్న అనుమానంతో ఇంట్లో పనిమనిషిని తొలగించినట్లు పోలీసులకు తెలిపారు.
అయితే డాక్టర్ భూపేంద్ర శ్రీవాస్తవ భార్య దగ్గర పని మనిషి వాట్సాప్ నంబర్ ఉంది. పని మనిషి వాట్సప్ డీపీ (Whatsapp dp) ఫొటోను తీక్షణంగా పరిశీలించగా పనిమనిషి ధరించిన చెవిదిద్దులు ఆమెవేనని భార్య అనుమానించింది. అనంతరం లాకర్ తెరిచి చూడగా చెవిపోగులు కూడా మాయమైనట్లు గుర్తించారు. దీంతో ఇంట్లోని ఆభరణాలు దొంగిలించింది పనిమనిషి అని అనుమానిస్తూ డాక్టర్ కుటుంబం పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పనిమనిషిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు విషయాన్ని కక్కేసింది. డాక్టర్ ఇంట్లో దొంగతనం చేసినట్లు అంగీకరించింది. నిందితురాలి నుంచి రూ.60 లక్షల (Rs 60 lakhs) విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు ఐదున్నర లక్షల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఇకపోతే నిందితురాలైన మహిళా.. వైద్యుడి ఇంట్లో పని చేస్తూ నెలకు రూ.8 వేలు జీతం తీసుకుంటోంది. ఇక ఆమె భర్త కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి కూడా తక్కువ ఆదాయమే వస్తుంది. కానీ ఆ మహిళ ఇంట్లో ఏసీ, సీసీ కెమెరాతో పాటు సకాల సౌకర్యాలు ఉండటం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. నమ్మకంతో పని కలిపిస్తే.. తిన్న ఇంటికే కన్నం వేసింది. ఇలాంటి వాళ్ల వల్ల ఇతరులకు పని ఇవ్వడానికి కూడా యజమానులు ఇబ్బంది పడుతుంటారు.