Education: ‘టీచర్ల శిక్షణ’ ఖాతా ఖాళీ! కాగ్ ఆడిట్‌తో వెలుగులోకి!
ABN , First Publish Date - 2023-10-18T10:34:36+05:30 IST
అప్పులు చేయించి కార్పొరేషన్లను నిండా ముంచిన జగన్ ప్రభుత్వం (Jagan Government).. ఇప్పుడు విద్యాశాఖపై పడింది. ఇటీవలే ఇంటర్ బోర్డు నిధులన్నీ ఇష్టానుసారం మళ్లించగా, ఇప్పుడు విద్యా పరిశోధ న, టీచర్ల శిక్షణకు కూడా నిధుల్లేని పరిస్థితిని తీసుకొచ్చింది
కోట్ల నుంచి లక్షల్లోకి ఎస్‌సీఈఆర్‌టీ నిధులు
2019-20లో 39.62కోట్లు.. ఇప్పుడు మిగిలింది 32 లక్షలే
ఆ ఫలితంగానే వాట్సా్‌పలో ప్రశ్నపత్రాలు
కాగ్ ఆడిట్‌తో వెలుగులోకి
(అమరావతి-ఆంధ్రజ్యోతి): అప్పులు చేయించి కార్పొరేషన్లను నిండా ముంచిన జగన్ ప్రభుత్వం (Jagan Government).. ఇప్పుడు విద్యాశాఖపై పడింది. ఇటీవలే ఇంటర్ బోర్డు నిధులన్నీ ఇష్టానుసారం మళ్లించగా, ఇప్పుడు విద్యా పరిశోధ న, టీచర్ల శిక్షణకు కూడా నిధుల్లేని పరిస్థితిని తీసుకొచ్చింది. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎ్‌ససీఈఆర్‌టీ) ఖాతా దాదాపు ఖాళీ అయ్యే దుస్థితికి తెచ్చింది. ఇటీవల కాగ్ నిర్వహించిన ఆడిట్‌తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆడిట్‌లో తెలిపిన వివరాల ప్రకారం 2018-19లో ఆ ఖాతాలో రూ.15.07 కోట్లు ఉంటే, ప్రస్తుతం అది రూ.32లక్షలకు పడిపోయింది. 2022-23 సంవత్సరం ముగిసేనాటికే రూ.50లక్షలకు చేరగా, ఈ ఏడాది పరిస్థితి ఇంకా దిగజారింది. ప్రభుత్వం ఏటా పేరుకు నిధులు కేటాయిస్తున్నా ఎస్‌సీఈఆర్‌టీ వాటిని సమర్థంగా వినియోగించడంలో విఫలమౌతోంది. ఇదే విషయాన్ని కాగ్ తప్పుబట్టగా ప్రభుత్వం ఆర్థిక సంవత్సరం చివర్లో నిధులు విడుదల చేస్తోందని, అందువల్ల ఖర్చు చేయలేకపోతున్నామని ఎస్‌సీఈఆర్‌టీ సమాధానమిచ్చింది. తద్వారా ప్రభుత్వం నిధులు సక్రమంగా ఇవ్వట్లేదనే విషయాన్ని పరోక్షంగా బయటపెట్టింది.
సిలబ్‌సపై పరిశోధనలు చేయడం, విద్యా క్యాలెండర్ రూపకల్పన, ఉపాధ్యాయులకు పలు అంశాలపై శిక్షణ ఇవ్వడం లాంటి అంశాలు ఎస్‌సీఈఆర్‌టీ పరిధిలో ఉంటాయి. ప్రధానంగా జాతీయ విద్యా విధానం, సీబీఎ్‌సఈ, మారిన సిలబస్ తదితర అంశాలపై టీచర్లకు శిక్షణ ఇస్తుంది. దాదాపు 40లక్షల మంది విద్యార్థులకు ఎలా బోధించాలి, వారికి ఏ రోజు పాఠాలు చెప్పాలనేది ఎస్‌సీఈఆర్‌టీనే నిర్దేశిస్తుంది. అంత కీలకమైన సంస్థను వైసీపీ ప్రభుత్వం దాదాపుగా నిర్వీర్యం చేసింది. ఎస్‌సీఈఆర్‌టీ ఖాతాలో ఉన్న నిధులకు అదనంగా కొత్త నిధులు ఇవ్వకపోగా, ఉన్నవి మొత్తం అయిపోయే వరకూ ప్రభుత్వం చోద్యం చూస్తోంది. నిధులను సకాలంలో విడుదల చేయక ప్రశ్నపత్రాల ముద్రణకూ నిధులు లేని దుస్థితి ఏర్పడింది. దీంతో ఇటీవల ఫార్మేటివ్ అసె్‌సమెంట్-2 పరీక్షల ప్రశ్నపత్రాలను వాట్సా్‌పలో పంపింది. టీచర్లు ఫోన్‌లో చూస్తూ బోర్డుపై ప్రశ్నలు రాస్తే, విద్యార్థులు వాటిని చూసి సమాధానాలు రాయాల్సి వచ్చింది.
ఆయన హయాంలోనే
2019 ఆగస్టులో ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌గా బి.ప్రతా్‌పరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అంటే దాదాపుగా వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటినుంచీ ఆయన సారథ్యంలోనే ఎస్‌సీఈఆర్‌టీ కార్యకలాపాలు సాగుతున్నాయి. నిధులు ఖాళీ అవ్వడానికి ఈయనే కారణమనే విమర్శలున్నాయి. అధికార పార్టీకి అత్యంత సన్నిహితంగా మెలిగే ఆయన ప్రభుత్వానికి ఎక్కడా ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో నిధులు ఏమైపోయినా పట్టించుకోలేదని ఉపాధ్యాయులు అంటున్నారు. పైగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూలంగా అనేక సమావేశాలు నిర్వహించడం, ఓట్ల విషయంలో టీచర్లపై ఒత్తిడి చేయడం లాంటి అనేక ఆరోపణలు ఆయనపై వచ్చాయి. ఆ స్వామి భక్తితోనే ఎస్‌సీఈఆర్‌టీ ఖాతా ఖాళీ అయిపోతున్నా మౌనంగా ఉంటున్నారని విద్యాశాఖ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఎస్‌సీఈఆర్‌టీ గత రెండేళ్ల ఖర్చులను పరిశీలిస్తే.. 2021-22లో రూ.18.27 కోట్లు ఖర్చు చేయగా, 2022-23లో రూ.8.31కోట్లకు పడిపోయింది.