AU ఇంజనీరింగ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ నోటిఫికేషన్‌

ABN , First Publish Date - 2023-04-05T14:58:42+05:30 IST

విశాఖపట్నం (Visakhapatnam) లోని ఆంధ్ర యూనివర్సిటీ (Andhra University) - ఇంజనీరింగ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(ఏయూఈఈటీ) 2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

AU ఇంజనీరింగ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ నోటిఫికేషన్‌
AU Engineering Entrance Test

విశాఖపట్నం (Visakhapatnam)లోని ఆంధ్ర యూనివర్సిటీ (Andhra University) - ఇంజనీరింగ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(ఏయూఈఈటీ) 2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా బీటెక్‌+ఎంటెక్‌ డ్యూయెల్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. నాలుగేళ్ల కోర్సు పూర్తిచేసిన తరవాత ప్రోగ్రామ్‌ నుంచి వైదొలగే వీలుంది. వీరు ఎగ్జిట్‌ ఫీజు కింద రూ.10,000లు చెల్లించాల్సి ఉంటుంది. వీరికి బీటెక్‌ డిగ్రీ ఇస్తారు.

విభాగాలు-సీట్లు: ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌లో మొత్తం510సీట్లు ఉన్నాయి. వీటిలో కంప్యూటర్‌ సైన్స్‌ 360, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ 60, మెకానికల్‌ 30, సివిల్‌ 30, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌ 30 సీట్లు ఉన్నాయి.

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మేథమెటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్‌/ పన్నెండోతరగతి/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులైనవారు అర్హులు. ఇంటర్‌ స్థాయిలో కనీసం 45 శాతం మార్కులు ఉండాలి. రిజర్వ్‌డ్‌ వర్గాల అభ్యర్థులకు 40 శాతం మార్కులు చాలు.

ఏయూఈఈటీ 2023 వివరాలు

పరీక్షని ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 100 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు అడుగుతారు. మేథమెటిక్స్‌ నుంచి 40, ఫిజిక్స్‌ నుంచి 30, కెమిస్ట్రీ నుంచి 30 ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలన్నీ ఇంటర్‌/పన్నెండో తరగతి స్థాయిలోనే ఉంటాయి. అభ్యర్థులు సమాధానాలను ఓఎంఆర్‌ పత్రం మీద గుర్తించాలి. ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం మార్కులు 100. పరీక్ష సమయం గంటన్నర. పరీక్ష సిలబస్‌ కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.1200; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1000

దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 25

పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కడప

ఏయూఈఈటీ 2023 తేదీలు: మే 3 నుంచి

ఫలితాలు విడుదల: మే 5 నుంచి

వెబ్‌సైట్‌: www.audoa.in

Updated Date - 2023-04-05T14:58:42+05:30 IST