Teachers Deputation: బదిలీలు ఈ ఏడాది లేనట్టే! సర్దుబాటుతో సరిపెట్టేస్తున్నారు!
ABN , First Publish Date - 2023-06-23T11:42:09+05:30 IST
రాష్ట్రంలో 7 వేల మంది ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై పంపించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇప్పటికే 4వేల మంది టీచర్లను బదిలీ చేసినట్టు తెలుస్తోంది. మిగిలిన వారిని కూడా విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా ఉపాధ్యాయులు లేని స్కూళ్లకు పంపించడానికి
7 వేల మంది టీచర్లకు డిప్యుటేషన్!
టీచర్ల కొరత ఉన్న పాఠశాలల్లో సర్దుబాటు
బదిలీలు లేకపోవడంతో తలెత్తిన సమస్య
హైదరాబాద్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 7 వేల మంది ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై పంపించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇప్పటికే 4వేల మంది టీచర్లను బదిలీ చేసినట్టు తెలుస్తోంది. మిగిలిన వారిని కూడా విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా ఉపాధ్యాయులు లేని స్కూళ్లకు పంపించడానికి చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ఈ నెల 12వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభమైన విషయం తెలిసిందే. రాష్ట్రంలో సుమారుగా 26 వేల ప్రభుత్వ బడులు ఉండగా, 25 లక్షలకుపైగా విద్యార్థులు చదువుతున్నారు. బడిబాట పేరిట ఈ నెల 3వ తేదీ నుంచి అడ్మిషన్లు ప్రారంభించగా, కొత్తగా లక్ష మందికిపైగా చేరారు. అయితే, రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టడానికి ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసినా.. కోర్టు స్టే కారణంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. దీంతో పలు స్కూళ్లల్లో టీచర్ల కొరత ఉండగా, కొన్ని చోట్ల అదనంగా ఉన్నారు. సాధారణంగా ఇలాంటి సమస్య ఉన్నప్పుడు రేషనలైజేషన్ ద్వారా ఆయా పాఠశాలల అవసరాలకు అనుగుణంగా బదిలీలు చేయాల్సి ఉంటుంది. అయితే, ఉపాధ్యాయుల బదిలీలు, రేషనలైజేషన్ ప్రక్రియ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. మరోవైపు, నిరుడు 1 నుంచి 8వ తరగతి వరకు అమలు చేసిన ఇంగ్లిషు మీడియంను ఈ ఏడాది నుంచి 9వ తరగతిలోనూ అమలు చేస్తున్నారు. దాంతో ఆయా పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం చదివే విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాల్సి ఉంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులను తాత్కాలిక సర్దుబాటు కింద డిప్యుటేషన్‌పై పంపిస్తున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 7వేల మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 4వేల మందిని వారు పని చేస్తున్న ప్రాంతానికి సమీపంలోని స్కూళ్లకు పంపినట్లు తెలిసింది. కాగా, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ద్వారానే ఈ సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉందని పలు ఉపాధ్యాయ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. కొన్నేళ్లుగా తాము బదిలీల కోసం పోరాడుతున్నా.. ప్రయోజనం ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
ఆ తప్పులపై విచారణ చేపట్టాలి: యూటీఎఫ్
పదో తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్య పుస్తకం కవర్ పేపర్‌పై రాజ్యాంగ పీఠికను తప్పుగా ప్రచురించిన విషయంపై విచారణ జరిపి, అందుకు బాధ్యులైన అధికారులపై చరలు తీసుకోవాలని యూటీఎఫ్ అధ్యక్షుడు జంగయ్య, ప్రధానకార్యదర్శి చావ రవి డిమాండ్ చేశారు. ఎస్సీఈఆర్టీ ప్రచురించిన పదవ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకం కవర్‌పేజీపై ముద్రించిన రాజ్యాంగ పీఠికలో సోషలిస్టు, సెక్యులర్ అనే పదాలను తొలగించడం సరికాదని అభిప్రాయపడ్డారు.