భువనగిరి డిగ్రీ కాలేజ్‌ ఫర్‌ ఉమెన్‌లో ప్రవేశాలు

ABN , First Publish Date - 2023-06-06T14:30:28+05:30 IST

భువనగిరిలోని తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్‌ ఫర్‌ ఉమెన్‌లో

భువనగిరి డిగ్రీ కాలేజ్‌ ఫర్‌ ఉమెన్‌లో ప్రవేశాలు
Admissions

భువనగిరిలోని తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్‌ ఫర్‌ ఉమెన్‌లో 2023-28 విద్యా సంవత్సరానికి గాను మొదటి సంవత్సరం ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ(ఎకనామిక్స్‌) కోర్సులో ప్రవేశానికి ప్రకటన వెలువడింది.

మిలిటరీ ఎడ్యుకేషన్‌, త్రివిధ దళాల్లో అధికారులుగా చేరేందుకు ఉద్దేశించిన పోస్టులకు సన్నద్ధులను చేయడం లక్ష్యంగా తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ.. యాద్రాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ‘తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్‌ ఫర్‌ ఉమెన్‌’ను ప్రత్యేకంగా ప్రారంభించింది. ఈ కాలేజీలో చేరాలని ఆసక్తి ఉన్న అర్హులైన బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు.

కోర్సు పేరు: అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ-ఎకనామిక్స్‌ (ఆంగ్ల మాధ్యమం)

సీట్ల సంఖ్య: 40. వీటిలో ఎస్సీ అభ్యర్థులకు 75%, బీసీ-సిలకు 2%, ఎస్టీలకు 6%, బీసీలకు 12%, మైనార్టీలకు 3%, ఓసీ/ఈబీసీ అభ్యర్థులకు 2% సీట్లు రిజర్వ్‌ చేశారు.

అర్హత: 2022-23లో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన బాలికలు అర్హులు. జూన్‌ 1 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. బాలికల కనీస ఎత్తు 152 సెం.మీ.కి మించి ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతంలో రూ.2,00,000, గ్రామీణ ప్రాంతంలో రూ.1,50,000 మించకూడదు.

దరఖాస్తుతో జతచేయాల్సిన పత్రాలు: క్యాస్ట్‌ సర్టిఫికెట్‌, ఇన్‌కమ్‌ సర్టిఫికెట్‌, ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌, బోనఫైడ్‌ సర్టిఫికెట్‌, ఇంటర్మీడియట్‌ పాస్‌ సర్టిఫికెట్‌, ఆధార్‌ కార్డు, ఐదు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు, ఆరోగ్య శ్రీ/రేషన్‌ కార్డు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తు ఫీజు: రూ.100

ఎంపిక విధానం: స్టేజ్‌-1(కామన్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌), స్టేజ్‌-2(ఫిజికల్‌ టెస్ట్‌), సైకో అనలిటికల్‌ టెస్టులు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ టెస్ట్‌, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా.

పరీక్షల విధానం: తొలుత స్టేజ్‌-1 కామన్‌ ఎంట్రెన్‌ ఎగ్జామ్‌ 100 మార్కులకు ఉంటుంది. ప్రశ్న పత్రం మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్న పత్రంలో నాలుగు విభాగాలుంటాయి. మేథ్స్‌ అండ్‌ రీజనింగ్‌ ఎబిలిటీ(25 మార్కులు), ఇంగ్లీష్‌(25 మార్కులు), జికె అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌(25 మార్కులు), జనరల్‌ ఎకనామిక్స్‌(25 మార్కులు)నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇక స్టేజ్‌-2 పరీక్షలో 10 మార్కులకు ఫిజికల్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఇందులో 100 ఎం స్ర్పింట్‌(2.5 మార్కులు), 400 మీటర్ల పరుగు(2.5 మార్కులు), సిట్‌ అప్స్‌(2.5 మార్కులు), షటిల్‌ రేస్‌(2.5 మార్కులు) ఉంటాయి. ఆ తరవాత 20మార్కులకు(థెమాటిక్‌ అప్రిషియేషన్‌ టెస్ట్‌-5 మార్కులు; వర్డ్‌ అసోసియేషన్‌ టెస్ట్‌-10 మార్కులు; సిట్యుయేషన్‌ రియాక్షన్‌ టెస్ట్‌-5 మార్కులు) సైకో అనలిటికల్‌ టెస్ట్స్‌ ఉంటుంది. అదేవిధంగా 20 మార్కులకు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌(లెక్చరేట్‌-10 మార్కులు, పర్సనల్‌ ఇంటర్వ్యూ - 10 మార్కులు) టెస్ట్‌ నిర్వహిస్తారు. స్టేజ్‌-1, స్టేజ్‌-2 పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి చివరగా మెడికల్‌ టెస్ట్‌ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 12

హాల్‌ టిక్కెట్‌ డౌన్‌లోడ్‌: జూన్‌ 14

స్టేజ్‌-1(కామన్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌) తేదీ: జూన్‌ 18

వెబ్‌సైట్‌: https://www.tswreis.ac.in/

Updated Date - 2023-06-06T14:30:28+05:30 IST