హైదరాబాద్‌ జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీలో ప్రవేశాలు

ABN , First Publish Date - 2023-06-07T14:16:28+05:30 IST

గ్రామీణ పాఠశాలల్లో కనీసం నాలుగేళ్లు చదివిన విద్యార్థులకు ప్రతి విభాగంలో 60 శాతం సీట్లు కేటాయించారు. ఈ ప్రోగ్రామ్‌లను

హైదరాబాద్‌ జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీలో ప్రవేశాలు
Admissions

హైదరాబాద్‌-రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ (పీజేటీఎ్‌సఏయూ)-డిప్లొమా ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అగ్రికల్చర్‌, ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌, అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌ విభాగాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 240 సీట్లు, అనుబంధ ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 600 సీట్లు ఉన్నాయి. అగ్రికల్చరల్‌ స్ట్రీమ్‌లో తెలంగాణ పాలిసెట్‌ 2023 ర్యాంక్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. గ్రామీణ పాఠశాలల్లో కనీసం నాలుగేళ్లు చదివిన విద్యార్థులకు ప్రతి విభాగంలో 60 శాతం సీట్లు కేటాయించారు. ఈ ప్రోగ్రామ్‌లను ఆంగ్ల మాధ్యమంలో నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్‌: ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీ అగ్రికల్చరల్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో మొత్తం 220 సీట్లు ఉన్నాయి. జోగిపేటలో బాలికల పాలిటెక్నిక్‌; బసంత్‌పూర్‌, జమ్మికుంట, మల్‌తుమ్మెదలలో బాలుర పాలిటెక్నిక్‌ కాలేజీలు ఉన్నాయి. వీటితోపాటు పాలెం, పొలాస, కంపసాగర్‌, మధిర, రుద్రూర్‌ పాలిటెక్నిక్‌లలో ఒక్కోదానిలో 20 సీట్లు; సిద్దిపేట-దోర్నాల పాలిటెక్నిక్‌లో 40 సీట్లు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో మొత్తం 450 సీట్లు ఉన్నాయి.

డిప్లొమా ఇన్‌ అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌: ప్రోగ్రామ్‌ వ్యవధి మూడేళ్లు. సంగారెడ్డి-కందిలోని అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌ పాలిటెక్నిక్‌లో 20 సీట్లు ఉన్నాయి. మెదక్‌-తునికి, ఖమ్మం-సత్తుపల్లి, సంగారెడ్డి-తుర్కాల ఖానాపూర్‌లలో ఉన్న అనుబంధ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ఒక్కోదానిలో 30 చొప్పున మొత్తం 90 సీట్లు ఉన్నాయి.

డిప్లొమా ఇన్‌ ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌: ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. వికారాబాద్‌ - గింగుర్తిలోని ఏకలవ్య ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌లో 60 సీట్లు ఉన్నాయి.

అర్హత వివరాలు: ఆంధ్రప్రదేశ్‌/ తెలంగాణ స్టేట్‌ బోర్డ్‌ నిర్వహించే పదోతరగతి పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. సీబీఎ్‌సఈ, ఐసీఎ్‌సఈ, ఎన్‌ఐఓఎస్‌, తెలంగాణ/ ఆంధ్రప్రదేశ్‌ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీల అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 35 శాతం మార్కులు తప్పనిసరి. అగ్రికల్చరల్‌ విభాగంలో తెలంగాణ పాలిసెట్‌ 2023 ర్యాంక్‌ పొంది ఉండాలి. అభ్యర్థుల వయసు డిసెంబరు 31 నాటికి 15 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయో పరిమితి 22 ఏళ్లు.

ముఖ్య సమాచారం

రిజిస్ట్రేషన్‌ ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.1100; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.600

రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: జూన్‌ 24

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 26

ఆన్‌లైన్‌ దరఖాస్తులో కరెక్షన్స్‌: జూన్‌ 27, 28

వెబ్‌సైట్‌: diploma.pjtsau.ac.in

Updated Date - 2023-06-07T14:16:28+05:30 IST