నాగార్జున వర్సిటీలో ప్రవేశాలు.. రెండు రకాలుగా కోర్సు నేర్చుకోవచ్చు!
ABN , First Publish Date - 2023-07-05T12:53:00+05:30 IST
గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ) దూరవిద్య విభాగం- వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులను ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో నిర్వహిస్తారు.
గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ) దూరవిద్య విభాగం- వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులను ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో నిర్వహిస్తారు.
డిగ్రీ
బీఏ, బీకాం, బీబీఏ ప్రోగ్రామ్‌ల వ్యవధి మూడేళ్లు. బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్(బీఎల్‌ఐఎస్సీ) కోర్సు వ్యవధి ఏడాది.
బీఏ సబ్జెక్టులు: ఎకనామిక్స్, హిస్టరీ, పాలిటిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, హిస్టరీ, స్పెషల్ ఇంగ్లీష్, స్పెషల్ తెలుగు, బ్యాంకింగ్, కంప్యూటర్ అప్లికేషన్స్
బీకాం సబ్జెక్టులు: జనరల్, కంప్యూటర్ అప్లికేషన్స్
బీబీఏ, బీఎల్‌ఐఎస్సీ, బీకాం(కంప్యూటర్ అప్లికేషన్స్) కోర్సులను ఆంగ్ల మాధ్యమంలో చదవాల్సి ఉంటుంది. బీఏ(ఎకనామిక్స్, బ్యాంకింగ్, కంప్యూటర్ అప్లికేషన్స్), బీకాం(జనరల్) కోర్సులను తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో చదువుకోవచ్చు. మిగిలిన బీఏ కోర్సులు తెలుగు మాధ్యమంలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్/పన్నెండోతరగతి/పాలిటెక్నిక్ డిప్లొమా/రెండేళ్ల ఐటీఐ/ఇంటర్ ఒకేషనల్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. బీఎల్‌ఐఎస్సీ కోర్సుకు మాత్రం ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
పీజీ
ఎంఏ, ఎంకాం, ఎంఎ్‌సడబ్ల్యూ కోర్సుల వ్యవధి రెండేళ్లు. మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్(ఎంఎల్‌ఐఎస్సీ) కోర్సు వ్యవధి ఏడాది.
ఎంఏ స్పెషలైజేషన్‌లు: ఇంగ్లీష్, తెలుగు, హిందీ, సంస్కృతం, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, సోషల్ వర్క్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్‌మెంట్.
ఎంకాం స్పెషలైజేషన్‌లు: అకౌంటెన్సీ, బ్యాంకింగ్
ఎంఏ కోర్సులో లాంగ్వేజ్ స్పెషలైజేషన్‌లను ఆ మాధ్యమంలోనే చదవాలి. ఎంఏ(ఎకనామిక్స్/హిస్టరీ/పొలిటికల్ సైన్స్/సోషియాలజీ) కోర్సులు తెలుగు మాధ్యమంలో ఉన్నాయి. మిగిలిన కోర్సులను ఇంగ్లీష్ మాధ్యమంలో చదవాలి.
అర్హత: ఎంఏ, ఎంఎ్‌సడబ్ల్యూ కోర్సులకు ఏదేని డిగ్రీ; ఎంఏ(ఎకనామిక్స్)కు బీఏ(ఎకనామిక్స్); ఎంకాం కోర్సుకు బీకాం/బీబీఏ; ఎంఎల్‌ఐఎస్సీ కోర్సుకు బీఎల్‌ఐఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంఏలో లాంగ్వేజ్ స్పెషలైజేషన్‌లకు ఆ లాంగ్వేజ్‌లు ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
డిప్లొమా: ఈ కోర్సులో ఫుడ్ ప్రొడక్షన్, సైకలాజికల్ గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్ స్పెషలైజేషన్‌లు ఉన్నాయి. కోర్సు వ్యవధి ఏడాది. ఇంగ్లీష్ మాధ్యమంలో చదవాల్సి ఉంటుంది. ఫుడ్ ప్రొడక్షన్ కోర్సుకు పదోతరగతి ఉత్తీర్ణులు, సైకలాజికల్ గైడెన్స్ కోర్సుకు ఇంటర్/పన్నెండోతరగతి/పాలిటెక్నిక్ డిప్లొమా/రెండేళ్ల ఐటీఐ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
సర్టిఫికెట్ కోర్సులు: హోటల్ అండ్ హాస్పిటల్ హౌస్ కీపింగ్, హెచ్‌ఐవీ ఎయిడ్స్ కౌన్సెలింగ్ కోర్సులు ఉన్నాయి. కోర్సు వ్యవధి ఏడాది. ఇంగ్లీష్ మాధ్యమంలో చదవాలి. హౌస్ కీపింగ్ కోర్సుకు పదోతరగతి ఉత్తీర్ణులు, ఎయిడ్స్ కౌన్సెలింగ్‌కు ఇంటర్(పారామెడికల్)తోపాటు ఏదేని డిగ్రీ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్య సమాచారం
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 31
వెబ్‌సైట్: www.anucde.info