అనంతపురం జేఎన్‌టీయూలో పీహెచ్‌డీ.. ఏఏ విభాగాల్లో అంటే..!
ABN , First Publish Date - 2023-06-10T13:25:18+05:30 IST
అనంతపురంలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ(జేఎన్‌టీయూఏ)-ఫుల్ టైం పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది
అనంతపురంలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ(జేఎన్‌టీయూఏ)-ఫుల్ టైం పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. యూనివర్సిటీ ఆధ్వర్యంలోని కళాశాలలు, అనుబంధ కళాశాలలకు చెందిన రీసెర్చ్ సెంటర్లలో అడ్మిషన్స్ ఇస్తారు.
విభాగాలు: కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్.
అర్హత: సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో ఎంఈ/ఎంటెక్ పూర్తిచేసి ఉండాలి. యూజీసీ నెట్/ సీఎ్‌సఐఆర్ నెట్/గేట్/సీడ్ వ్యాలిడ్ స్కోర్ ఉండాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1500; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1250
దరఖాస్తు సబ్మిషన్‌కు చివరి తేదీ: జూన్ 12
చిరునామా: డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్, జేఎన్‌టీయూ, అనంతపురం.
వెబ్‌సైట్: www.jntua.ac.in