విజయవాడ ‘స్పా’లో పీజీ, పీహెచ్‌డీ నోటిఫికేషన్‌

ABN , First Publish Date - 2023-04-17T12:29:34+05:30 IST

విజయవాడలోని స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌(స్పా)- పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి

విజయవాడ ‘స్పా’లో  పీజీ, పీహెచ్‌డీ నోటిఫికేషన్‌
Notification

విజయవాడలోని స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌(స్పా)- పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి విడివిడిగా నోటిఫికేషన్‌లు విడుదల చేసింది.

పీజీ ప్రోగ్రామ్‌లు: ఎం ఆర్క్‌ ప్రోగ్రామ్‌లో సస్టయినబుల్‌ ఆర్కిటెక్చర్‌, ల్యాండ్‌స్కేప్‌ ఆర్కిటెక్చర్‌, ఆర్కిటెక్చరల్‌ కన్జర్వేషన్‌ స్పెషలైజేషన్‌లు ఉన్నాయి. ఎం ప్లానింగ్‌ ప్రోగ్రామ్‌లో ఎన్విరాన్‌మెంటల్‌ ప్లానింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, అర్బన్‌ అండ్‌ రీజనల్‌ ప్లానింగ్‌, ట్రాన్స్‌పోర్ట్‌ ప్లానింగ్‌ స్పెషలైజేషన్‌లు ఎంచుకోవచ్చు. బిల్డింగ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో మాస్టర్‌ ప్రోగ్రామ్‌, మాస్టర్‌ ఆఫ్‌ అర్బన్‌ డిజైన్‌ ప్రోగ్రామ్‌ కూడా ఉన్నాయి. ఒక్కో పీజీ ప్రోగ్రామ్‌లో 25 సీట్లు ఉన్నాయి. సీసీఎంటీ విధానంలో 13 సీట్లను, డైరెక్ట్‌ అడ్మిషన్స్‌ ద్వారా 12 సీట్లను భర్తీ చేస్తారు.

అర్హత: పీజీ(ఆర్కిటెక్చర్‌)లో ప్రవేశానికి బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ పూర్తిచేసి ఉండాలి. మాస్టర్‌ ఆఫ్‌ బిల్డింగ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌నకు బీఈ/బీటెక్‌(సివిల్‌/బిల్డింగ్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ టెక్నాలజీ/ కన్‌స్ట్రక్షన్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌/ కన్‌స్ట్రక్షన్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌) ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పీజీ(ప్లానింగ్‌)కు బీఈ/ బీటెక్‌(సివిల్‌/ ప్లానింగ్‌) లేదా బీ ప్లానింగ్‌ / బీ ఆర్క్‌ ఉత్తీర్ణులు అర్హులు. జాగ్రఫీ/ ఎకనామిక్స్‌/ సోషియాలజీ/ స్టాటిస్టిక్స్‌/ ఆపరేషన్స్‌ రిసెర్చ్‌ విభాగాల్లో పీజీ చేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మాస్టర్‌ ఆఫ్‌ అర్బన్‌ డిజైన్‌ ప్రోగ్రామ్‌నకు బీఆర్క్‌ లేదా డిగ్రీ(ఇంజనీరింగ్‌/ డిజైన్‌/ ఫైన్‌ ఆర్ట్స్‌) ఉత్తీర్ణులై ఉండాలి. ఏ కోర్సులోనైనా ప్రథమ శ్రేణి మార్కులు తప్పనిసరి.

ఎంపిక: ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌లో అర్హత సాధించిన వారికి పర్సనల్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్ప్‌సకు 10, పోర్ట్‌ఫోలియోకు 30, ఇంటర్వ్యూ స్కోర్‌కు 60 మార్కుల వెయిటేజీ ఇస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.2,000; ఈడబ్ల్యూఎస్‌, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1,000

దరఖాస్తు హార్డ్‌ కాపీ చేరేందుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 28

అభ్యర్థుల ప్రావిజనల్‌ లిస్ట్‌ విడుదల: మే 3న

ఎంట్రెన్స్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూలు: మే 15, 16

ఎంపికైన అభ్యర్థుల లిస్ట్‌ విడుదల: మే 20న

పీహెచ్‌డీ: డాక్టోరల్‌ ప్రోగ్రామ్‌లో ఫుల్‌ టైం, పార్ట్‌ టైం విధానాలు ఉన్నాయి. ఫుల్‌ టైం ప్రోగ్రామ్‌నకు ఫెలోషిప్‌ అర్హత ఉన్న రిసెర్చ్‌ స్కాలర్స్‌, సెల్ఫ్‌ ఫైనాన్స్‌డ్‌ రిసెర్చ్‌ స్కాలర్స్‌ అప్లయ్‌ చేసుకోవచ్చు. పార్ట్‌ టైం ప్రోగ్రామ్‌నకు ప్రాజెక్ట్‌ స్టాఫ్‌, అకడమిక్‌ ఫ్యాకల్టీ మెంబర్లు, వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ అర్హులు.

విభాగాలు: ప్లానింగ్‌, ఆర్కిటెక్చర్‌, బిల్డింగ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌

అర్హత: డాక్టోరల్‌ ప్రోగ్రామ్‌నకు ప్రథమ శ్రేణి మార్కులతో పీజీ (ఆర్కిటెక్చర్‌/ ప్లానింగ్‌/ బిల్డింగ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌) పూర్తిచేసి ఉండాలి. కనీసం 70 శాతం మార్కులతో బీఈ(సివిల్‌ ఇంజనీరింగ్‌)/ బీ ఆర్క్‌/ బీ ప్లానింగ్‌ ఉత్తీర్ణతతోపాటు మూడేళ్ల బోధన/రిసెర్చ్‌/ప్రొఫెషనల్‌ అనుభవం ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రోగ్రామ్‌ను అనుసరించి గేట్‌/సీడ్‌/జేఆర్‌ఎఫ్‌ అర్హత తప్పనిసరి.

ఎంపిక: రిటెన్‌ టెస్ట్‌లో అర్హత సాధించినవారిని పర్సనల్‌ ఇంటర్వ్యూకి పిలుస్తారు. రిసెర్చ్‌ రైట్‌పకు 20, ప్రజంటేషన్‌ ఆఫ్‌ రిసెర్చ్‌ ఇంట్రె్‌స్టకు 30, ఇంటర్వ్యూ స్కోర్‌కు 50 మార్కుల వెయిటేజీ ఇస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.3,000; ఈడబ్ల్యూఎస్‌, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.2,000

దరఖాస్తు చేరేందుకు చివరి తేదీ: మే 1

అభ్యర్థుల ప్రావిజనల్‌ లిస్ట్‌ విడుదల: మే 8న

ఎంట్రెన్స్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూలు: మే 15, 16

ఎంపికైన అభ్యర్థుల లిస్ట్‌ విడుదల: మే 19న

ఎంట్రెన్స్‌ టెస్ట్‌ వివరాలు: ఇందులో 40 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు, రెండు డిస్ర్కిప్టివ్‌ టైప్‌ ప్రశ్నలు ఇస్తారు. మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలకు ఒక్కోదానికి ఒక మార్కు, డిస్ర్కిప్టివ్‌ ప్రశ్నలకు ఒక్కోదానికి అయిదు మార్కులు కేటాయించారు. మొత్తం మార్కులు 50. పరీక్ష సమయం గంట. ఒక్కో ప్రోగ్రామ్‌నకు నిర్దేశించిన పరీక్ష సిలబస్‌ కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.

చిరునామా: రిజిస్ట్రార్‌, స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌, సర్వే నెం.4/4, ఐటీఐ రోడ్‌, విజయవాడ-520008.

వెబ్‌సైట్‌: www.spav.ac.in

Updated Date - 2023-04-17T12:29:34+05:30 IST