Education: జేఎన్‌‌టీయూహెచ్‌-సీఎంయూలో ఎంబీఏ

ABN , First Publish Date - 2023-10-10T17:31:33+05:30 IST

హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ (జేఎన్‌టీయూహెచ్‌)- యూఎ్‌సఏలోని సెంట్రల్‌ మిచిగన్‌ యూనివర్సిటీ సహకారంతో నిర్వహిస్తున్న ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రోగ్రామ్‌

Education: జేఎన్‌‌టీయూహెచ్‌-సీఎంయూలో ఎంబీఏ

హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ (జేఎన్‌టీయూహెచ్‌)- యూఎ్‌సఏలోని సెంట్రల్‌ మిచిగన్‌ యూనివర్సిటీ సహకారంతో నిర్వహిస్తున్న ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. మొదటి ఏడాది జేఎన్‌టీయూహెచ్‌లో, రెండో ఏడాది సీఎంయూలో చదవాల్సి ఉంటుంది. ప్రోగ్రామ్‌లో భాగంగా సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌, రీసెర్చ్‌ ప్రాజెక్ట్‌, లెక్చరింగ్‌, కేస్‌ స్టడీస్‌, ఇండస్ట్రీ విజిట్స్‌, అసైన్‌మెంట్స్‌ ఉంటాయి. మొత్తం 20 సీట్లు ఉన్నాయి. రిజర్వేషన్‌లు వర్తించవు. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సీఎంయూలో చదవడం కోసం అభ్యర్థులు పాస్‌పోర్ట్‌, వీసా సిద్దం చేసుకోవాలి. మొదటి సంవత్సర కోర్సు పూర్తయ్యేనాటికి వీసా రాని అభ్యర్థులకు జేఎన్‌టీయూహెచ్‌ రెండు అవకాశాలు కల్పిస్తుంది. కోర్సు నుంచి వైదొలగాలనుకుంటే వీరికి పీజీ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ అవార్డును ప్రదానం చేస్తుంది. లేదంటే మరోసారి వీసాకు అప్లయ్‌ చేసుకొనే అవకాశం ఇస్తుంది. ఇక్కడ పీజీడీఎం పొందిన అభ్యర్థులు ఐసెట్‌ రాసి రెగ్యులర్‌ ఎంబీఏలో చేరడానికి అనర్హులు. నిబంధనల ప్రకారం ప్రోగ్రామ్‌ పూర్తిచేసిన అభ్యర్థులకు సెంట్రల్‌ మిచిగన్‌ యూనివర్సిటీ ఎంబీఏ డిగ్రీని ప్రదానం చేస్తుంది. ప్రోగ్రామ్‌ పూర్తయిన తరవాత యూఎస్‌ నుంచి వెళ్లాల్సిన అవసరం లేదు. వీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మల్టీనేషనల్‌ కంపెనీలలో ఉద్యోగావకాశాలకోసం ప్రయత్నించవచ్చు.

స్పెషలైజేషన్‌లు: ప్రోగ్రామ్‌ రెండో ఏడాదిలో అభ్యర్థులు స్పెషలైజేషన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అకౌంటింగ్‌, ఫైనాన్స్‌, ఎకనామిక్స్‌, ఎంఐఎ్‌స/ఎ్‌సఏపీ, మేనేజ్‌మెంట్‌, కన్సల్టింగ్‌, మార్కెటింగ్‌ స్పెషలైజేషన్‌లు ఉన్నాయి.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి నాలుగేళ్ల బీఈ/బీటెక్‌/బీఫార్మసీ/బీఎస్సీ(అగ్రికల్చర్‌)/బీడీఎస్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంఏ/ఎంకాం/ఎమ్మెస్సీ; ఏడాది పీజీ; ఏదేని పీజీ డిప్లొమా పూర్తిచేసినవారు కూడా అర్హులే. ఇంగ్లీష్‌ చదవడం, రాయడంలో ప్రావీణ్యం తప్పనిసరి. అడ్మిషన్‌ పొందిన ఏడాదిలోపు అభ్యర్థులు జీమ్యాట్‌, టోఫెల్‌ అర్హత సాధించాల్సి ఉంటుంది. జీమ్యాట్‌లో కనీసం 500 పాయింట్లు, టోఫెల్‌లో 79 స్కోర్‌ రావాలి.

రాత పరీక్ష వివరాలు

  • దీనిని ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. అన్నీ మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలే అడుగుతారు. సమాధానాలను బ్లూ/బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్‌తో ఓఎంఆర్‌ పత్రం మీద గుర్తించాలి. ప్రశ్నపత్రంలో మూడు సెక్షన్‌లు ఉంటాయి.

  • క్వాంటిటేటివ్‌ సెక్షన్‌లో అర్థమెటిక్‌, ఎలిమెంటరీ ఆల్జీబ్రా, జామెట్రీ అంశాలనుంచి 37 ప్రశ్నలు ఇస్తారు. ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ నుంచి 22, డేటా సఫిషియెన్సీ నుంచి 15 ప్రశ్నలు అడుగుతారు.

  • వెర్బల్‌ సెక్షన్‌లో ఇంగ్లీష్‌ గ్రామర్‌ అంశాలపై 41 ప్రశ్నలు ఇస్తారు. క్రిటికల్‌ రీజనింగ్‌ నుంచి 12, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ నుంచి 14, సెంటెన్స్‌ కరెక్షన్‌కు సంబంధించి 15 ప్రశ్నలు అడుగుతారు.

  • ఇంటిగ్రేటెడ్‌ రీజనింగ్‌ సెక్షన్‌లో టేబుల్‌ అనాలసిస్‌, గ్రాఫిక్స్‌, మల్టీ సోర్స్‌ రీజనింగ్‌ అంశాలనుంచి 12 ప్రశ్నలు అడుగుతారు.

ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ.2000

దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 31

జేఎన్‌టీయూహెచ్‌ వద్ద హాల్‌ టికెట్లు ఇచ్చే తేదీ: నవంబరు 8

రాత పరీక్ష తేదీ: నవంబరు 10

వెబ్‌సైట్‌: jntuh.ac.in

Updated Date - 2023-10-10T17:31:33+05:30 IST