Education: జేఎన్‌టీయూహెచ్‌లో పార్ట్‌ టైం పీజీ

ABN , First Publish Date - 2023-10-04T16:52:18+05:30 IST

హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ (జేఎన్‌టీయూహెచ్‌)-పార్ట్‌ టైం పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగిస్తూ నోటిఫికేషన్‌

Education: జేఎన్‌టీయూహెచ్‌లో పార్ట్‌ టైం పీజీ

హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ (జేఎన్‌టీయూహెచ్‌)-పార్ట్‌ టైం పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎంటెక్‌, ఎంబీఏ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో ప్రోగ్రామ్‌ వ్యవధి మూడేళ్లు. ఆరు సెమిస్టర్లు ఉంటాయి. వీటిని ఉద్యోగులకు ప్రత్యేకించారు. దరఖాస్తు నాటికి హైదరాబాద్‌ పరిధిలో కనీసం ఏడాదిపాటు ఉద్యోగం చేసిన అనుభవం తప్పనిసరి. దరఖాస్తుతోపాటు ఒరిజినల్‌ సర్వీస్‌ సర్టిఫికెట్‌ అప్‌లోడ్‌ చేయాలి. ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ద్వారా అడ్మిషన్స్‌ ఇస్తారు. ఈ ప్రోగ్రామ్‌లకు ఎటువంటి స్కాలర్‌షిప్‌ లభించదు.

స్పెషలైజేషన్‌లు: ఎంటెక్‌ ప్రోగ్రామ్‌లో ఎలక్ట్రికల్‌ పవర్‌ ఇంజనీరింగ్‌, పవర్‌ ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ డ్రైవ్స్‌, ఇంజనీరింగ్‌ డిజైన్‌, థర్మల్‌ ఇంజనీరింగ్‌, అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫాక్చరింగ్‌ సిస్టమ్స్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఇండస్ట్రియల్‌ మెటలర్జీ, బయోటెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజ్‌మెంట్‌, వాటర్‌ రిసోర్సెస్‌ ఇంజనీరింగ్‌, రిమోట్‌ సెన్సింగ్‌ అండ్‌ జీఐఎస్‌ స్పెషలైజేషన్‌లు ఉన్నాయి. స్పెషలైజేషన్‌కు 30 సీట్లు ప్రత్యేకించారు. ఎంబీఏ ప్రోగ్రామ్‌లో హెచ్‌ఆర్‌, ఫైనాన్స్‌, మార్కెటింగ్‌, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ స్పెషలైజేషన్‌లు ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్‌లో మొత్తం 30 సీట్లు ఉన్నాయి.

అర్హత వివరాలు: ఎంటెక్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి స్పెషలైజేషన్‌కు నిర్దేశించిన విభాగాల్లో బీఈ/బీటెక్‌/ఏఎంఐఈ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్‌ సైన్స్‌కు ఎంసీఏ ఉత్తీర్ణులు; బయోటెక్నాలజీకి ఎమ్మెస్సీ(ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్‌/కెమిస్ట్రీ/బయోకెమిస్ట్రీ/మైక్రోబయాలజీ/లై్‌ఫసైన్సె ్‌స/బయోటెక్నాలజీ)/బీవీఎస్సీ/ఎంబీబీఎ్‌స/బీడీఎ ్‌స/బీఫార్మసీ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజ్‌మెంట్‌కు ఏదేని డిగ్రీ(ఇంజనీరింగ్‌/టెక్నాలజీ/ఆర్కిటెక్చర్‌/ప్లానింగ్‌/అగ్రికల్చర్‌); పీజీ(సైన్సె్‌స/కంప్యూటర్‌ అప్లికేషన్స్‌/ఐటీ)/ఎంసీఏ పూర్తిచేసి ఉండాలి. వాటర్‌ రిసోర్సెస్‌ ఇంజనీరింగ్‌కు ఎమ్మెస్సీ (జియోఫిజిక్స్‌/జియాలజీ/హైడ్రాలజీ/రిమోట్‌ సెన్సింగ్‌/ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సె్‌స/అగ్రికల్చర్‌/జియోస్పేషియల్‌/ఎర్త్‌ సైన్సె్‌స/అట్మాస్పిరిక్‌ సైన్సెస్‌/వాటర్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్‌) పూర్తిచేసినవారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. రిమోట్‌ సెన్సింగ్‌ అండ్‌ జీఐఎ్‌సకి ఎమ్మెస్సీ (జియోఇన్ఫర్మాటిక్స్‌/జియోమాటిక్స్‌/మేథ్స్‌/ఫిజిక్స్‌/జాగ్రఫీ/అగ్రికల్చర్‌/వాటర్‌ రిసోర్సెస్‌/ వాటర్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సె్‌స/జియోస్పేషియల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ/ఎర్త్‌ రిసోర్సె్‌స/ఓషన్‌ సైన్సె్‌స)/ఎంసీఏ/ఎంబీఏ పూర్తిచేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ఏదేని మూడేళ్ల డిగ్రీ పాసైతే చాలు.

అడ్మిషన్‌ టెస్ట్‌ వివరాలు: పరీక్ష సమయం గంట. ఇందులో మొత్తం 60 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఇస్తారు. ఎంటెక్‌లో ప్రవేశానికి నిర్వహించే పరీక్షలో సంబంధిత స్పెషలైజేషన్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఎంబీఏ అభ్యర్థులకు అనలిటికల్‌/రీజనింగ్‌ ఎబిలిటీ, మేథమెటికల్‌ ఎబిలిటీ, కమ్యూనికేషన్‌ ఎబిలిటీ అంశాలనుంచి ప్రశ్నలు అడుగుతారు. ఎంట్రెన్స్‌ టెస్ట్‌ సిలబస్‌ కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు. టెస్ట్‌ తేదీలను త్వరలో ప్రకటిస్తారు.

ట్యూషన్‌ ఫీజు: సెమిస్టర్‌కు రూ.25,000

దరఖాస్తు ఫీజు: రూ.3,000

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 9

దరఖాస్తుతోపాటు అప్‌లోడ్‌ చేయాల్సిన పత్రాలు: పదోతరగతి, ఇంటర్‌, డిగ్రీ, పీజీ మార్కుల పత్రాలు; టీసీ; అనుభవం సంబంధిత పత్రాలు; నో ఆబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌; సర్వీస్‌ సర్టిఫికెట్‌; మెడికల్‌ సర్టిఫికెట్‌(దివ్యాంగులకు మాత్రమే)

పరీక్ష కేంద్రం: జేఎన్‌టీయూహెచ్‌ క్యాంపస్‌, కూకట్‌పల్లి, హైదరాబాద్‌

వెబ్‌సైట్‌: www.jntuh.ac.in

Updated Date - 2023-10-04T16:52:18+05:30 IST