తెలంగాణ బీసీ మహిళా గురుకులాల్లో బీఎస్సీ అగ్రికల్చర్‌ ప్రవేశాలు

ABN , First Publish Date - 2023-07-10T17:24:49+05:30 IST

మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని మహిళా వ్యవసాయ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ వెలువడింది. వనపర్తి అగ్రికల్చరల్‌ కాలేజ్‌, కరీంనగర్‌ అగ్రికల్చరల్‌ కాలేజ్‌లలో అడ్మిషన్స్‌ నిర్వహిస్తారు.

తెలంగాణ బీసీ మహిళా గురుకులాల్లో బీఎస్సీ అగ్రికల్చర్‌ ప్రవేశాలు

మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని మహిళా వ్యవసాయ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ వెలువడింది. వనపర్తి అగ్రికల్చరల్‌ కాలేజ్‌, కరీంనగర్‌ అగ్రికల్చరల్‌ కాలేజ్‌లలో అడ్మిషన్స్‌ నిర్వహిస్తారు. ఒక్కో కాలేజ్‌లో 120 సీట్లు ఉన్నాయి. రాష్ట్రానికి చెందిన మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. బీసీ అభ్యర్థులకు 75 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 5 శాతం, ఓసీ/ఈబీసీ అభ్యర్థులకు 2 శాతం, అనాథలకు 3 శాతం సీట్లు కేటాయించారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా తెలంగాణ ఎంసెట్‌ 2023 స్కోర్‌ ప్రకారం 85 శాతం సీట్లను భర్తీ చేస్తారు. మిగిలిన 15 శాతం సీట్లను అగ్రిసెట్‌ 2023 స్కోర్‌ ద్వారా భర్తీ చేస్తారు. ఇందుకు విడిగా మరో నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. ప్రోగ్రామ్‌ వ్యవధి నాలుగేళ్లు.

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఫిజికల్‌ సైన్సెస్‌, బయలాజికల్‌ సైన్సెస్‌ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్‌/పన్నెండోతరగతి/తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. తెలంగాణ ఎంసెట్‌ 2023 అర్హత పొంది ఉండాలి. అభ్యర్థి వయసు 2023 డిసెంబరు 31 నాటికి 17 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 17 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. కుటుంబ వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000; పట్టణాల్లో రూ.2,00,000 మించకూడదు.

ఫీజు: రూ.1000

దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 31

కరెక్షన్స్‌ విండో ఓపెన్‌: ఆగస్టు 1 నుంచి 2 వరకు

వెబ్‌సైట్‌: mjptbcwreis.telangana.gov.in

Updated Date - 2023-07-10T17:24:49+05:30 IST