Jobs: తెలంగాణ జెన్‌కోలో పోస్టులు.. ఖాళీలెన్నంటే..!

ABN , First Publish Date - 2023-10-06T12:43:25+05:30 IST

తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ(టీఎస్‌ జెన్‌కో) కింద పేర్కొన్న రెగ్యులర్‌ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న యాదాద్రి, భద్రాద్రి విద్యుత్‌ కేంద్రాల నిర్వహణతో

Jobs: తెలంగాణ జెన్‌కోలో పోస్టులు.. ఖాళీలెన్నంటే..!

ఖాళీలు 339

తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ(టీఎస్‌ జెన్‌కో) కింద పేర్కొన్న రెగ్యులర్‌ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న యాదాద్రి, భద్రాద్రి విద్యుత్‌ కేంద్రాల నిర్వహణతో పాటు ఇప్పటికే ఉన్న పాత విద్యుత్‌ కేంద్రాల అవసరాల కోసం ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

మొత్తం ఖాళీలు: 339(లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌ - 94, జనరల్‌ రిక్రూట్‌మెంట్‌ - 245)

విభాగాలు: ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఎలకా్ట్రనిక్స్‌, సివిల్‌

అర్హతలు: బ్యాచిలర్స్‌ డిగ్రీ(ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌/ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌ ఇంజనీరింగ్‌/మెకానికల్‌ ఇంజనీరింగ్‌/ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌/ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ పవర్‌/పవర్‌ ఎలకా్ట్రనిక్స్‌/సివిల్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 2023 జూలై 1 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.65,600 - రూ.1,31,220

దరఖాస్తు రుసుము: రూ.400

ఎంపిక విధానం: రాత పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: అక్టోబరు 07

ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపు చివరి తేదీ: అక్టోబరు 29

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 29

రాత పరీక్ష తేదీ: డిసెంబరు 03

వెబ్‌సైట్‌: tsgenco.co.in/

Updated Date - 2023-10-06T12:43:25+05:30 IST