ఏపీ డీఎంఈలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు.. ఖాళీలెన్నంటే..!
ABN , First Publish Date - 2023-07-20T13:00:57+05:30 IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్.... ఏపీ డీఎంఈ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రి, వైద్య కళాశాలల్లోని వివిధ స్పెషాలిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు 590

స్పెషాలిటీలు: సీటీ సర్జరీ, కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ, మెడికల్ జీఈ, నియోనాటాలజీ, నెఫ్రాలజీ, న్యూరో సర్జరీ, న్యూరాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, అనస్థీషియా, డెర్మటాలజీ, ఎమర్జెన్సీ, మెడిసిన్ జనరల్ సర్జరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, న్యూక్లియర్ మెడిసిన్, ఓబీసీ ఆర్థోపెడిక్స్ తదతరాలు.
అర్హత: మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ(డీఎం/ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ/డీఎంఏ) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 42 ఏళ్లు మించకూడదు
ఎంపిక ప్రక్రియ: పోస్టు గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఎగ్జామ్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు ఫీజు: రూ.1000. బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్తులకు రూ.500
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 26
వెబ్‌సైట్: https://dme.ap.nic.in/