Jobs: టెన్త్ ఉత్తీర్ణతతో భారత్ ఎలక్ట్రానిక్స్‌లో కొలువులు
ABN , First Publish Date - 2023-08-29T17:55:41+05:30 IST
బెంగళూరులోని భారత్ ఎలకా్ట్రనిక్స్ లిమిటెడ్(బెల్) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టునుబట్టి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిప్లొమా, ఐటీఐ, బీకాం, బీబీఎం, పదోతరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులు. 2023 సెప్టెంబరు 5లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
బెంగళూరులోని భారత్ ఎలకా్ట్రనిక్స్ లిమిటెడ్(బెల్) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టునుబట్టి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిప్లొమా, ఐటీఐ, బీకాం, బీబీఎం, పదోతరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులు. 2023 సెప్టెంబరు 5లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం 63 పోస్టులు ఉన్నాయి. వీటిల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ(కంప్యూటర్ సైన్స్)-10, సివిల్-6, టెక్నీషియన్-సి(ఎలకా్ట్రనిక్ మెకానిక్)-27, ఫిట్టర్-12, ఎలక్ట్రికల్-3, డ్రాఫ్ట్స్‌మన్(మెకానికల్)-2, జూనియర్ అసిస్టెంట్-3 ఖాళీలు ఉన్నాయి.
అన్ని పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 28 సంవత్సరాలు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ(ఎన్‌సీఎల్)లకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 ఏళ్లు గరిష్ఠ వయోపరిమితి నిబంధనలో సడలింపు ఉంటుంది. జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.250. ఆన్‌లైన్ విధానంలో చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఎక్స్ సర్వీ్‌సమన్ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ: సంబంధిత విభాగాల్లో అభ్యర్థులు మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తిచేయాలి. జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. ఎంపికైన అభ్యర్థులకు ఆరు నెలలు శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణ కాలంలో నెలకు రూ.10,000 స్టయిపెండ్ చెల్లిస్తారు. శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకొని, గ్రెడేషన్ టెస్ట్ పాసైనవారిని రెగ్యులర్ పే స్కేల్‌తో ఉద్యోగంలోకి తీసుకుంటారు.
టెక్నీషియన్ - సి: పదో తరగతితోపాటు ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. ఏడాది అప్రెంటిస్ ట్రెయినింగ్ పూర్తిచేయాలి. సంబంధిత విభాగంలో నేషనల్ అప్రెంటి్‌సషిప్ సర్టిఫికెట్ ఉండాలి. లేదా పదో తరగతి పాసై సంబంధిత విభాగంలో మూడేళ్ల నేషనల్ అప్రెంటి్‌సషిప్ సర్టిఫికెట్ కోర్సు పూర్తిచేయాలి. జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 60 శాతం మార్కులతో, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి.
జూనియర్ అసిస్టెంట్: మూడేళ్ల బీకామ్/బీబీఎం ఉత్తీర్ణులై ఉండాలి. జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 60 శాతం మార్కులతో, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
పైన పేర్కొన్న మూడు పోస్టులకు దరఖాస్తు చేసేవాళ్లు తప్పనిసరిగా కర్ణాటక ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్చేంజీలో తమ పేరును రిజిష్టర్ చేసుకుని ఉండాలి.
ఎంపిక: అర్హతల ఆధారంగా అభ్యర్థుల షార్ట్‌లిస్ట్ తయారు చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షకు మొత్తం 150 మార్కులు కేటాయించారు. పార్ట్-1 50 మార్కులు కేటాయించారు. ఇందులో.. జనరల్ ఆప్టిట్యూడ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, అనలిటికల్, కాంప్రహెన్షన్, న్యూమరసీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్, జనరల్ నాలెడ్జ్ నైపుణ్యాలను పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతారు. పార్ట్-2 టెక్నికల్ ఆప్టిట్యూడ్‌కు 100 మార్కులు నిర్దేశించారు. ఇందులో భాగంగా సంబంధిత విభాగానికి చెం దిన టెక్నికల్/ప్రొఫెషనల్ నాలెడ్జ్‌ను పరీక్షించేలా 100 ప్రశ్నలు ఇస్తారు. ఈ రాత పరీక్షలో జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రెండు పార్టుల్లోనూ 35 శాతం కనీసం అర్హత మార్కులు సాఽ ధించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు రెండు పార్టుల్లోనూ 30 శాతం మార్కులు సాధించాలి.
ఎంపికైన అభ్యర్థులకు మూలవేతనంతోపాటు డియర్‌నెస్, హౌస్‌రెంట్ అలవెన్స్, యాన్యువల్ బేసిక్ పే మీద 30 శాతం జీతభత్యాలు ఉంటాయి. అదనంగా రీయింబర్స్‌మెంట్ ఆఫ్ మెడికల్ ఎక్స్‌పెన్సెస్, గ్రూప్ ఇన్సూరెన్స్, పీఎఫ్, గ్రాట్యుటీ తదితర సౌకర్యాలు ఉంటాయి.
వెబ్‌సైట్: https://bel-india.in/