Jobs: లక్షకు పైగా జీతంతో కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు

ABN , First Publish Date - 2023-08-24T16:05:47+05:30 IST

కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌, జూనియర్‌ ట్రాన్స్‌లేటర్‌, సీనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించే రాత పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌ను స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌(ఎ్‌సఎ్‌ససీ) విడుదల చేసింది.

Jobs: లక్షకు పైగా జీతంతో కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు

ఖాళీలు: 307

కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌, జూనియర్‌ ట్రాన్స్‌లేటర్‌, సీనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించే రాత పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌ను స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌(ఎ్‌సఎ్‌ససీ) విడుదల చేసింది.

కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాలు/సంస్థలు: కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌, ఏఐఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌, కాగ్‌, సెంట్రల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ట్రిబ్యునల్‌, సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌, కన్జూమర్‌ అఫైర్స్‌, ఫుడ్‌ అండ్‌ పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ పాలసీ అండ్‌ ప్రమోషన్‌, ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌, మినిస్ట్రీ ఆఫ్‌ జల్‌ శక్తి, మినిస్ట్రీ ఆఫ్‌ మైన్స్‌ తదితరాలు.

పరీక్ష పేరు: జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌, జూనియర్‌ ట్రాన్స్‌లేటర్‌, సీనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌ ఎగ్జామినేషన్‌-2023

అర్హతలు: పోస్టును అనుసరించి మాస్టర్‌ డిగ్రీ(హిందీ/ఇంగ్లీష్‌). డిగ్రీ స్థాయిలో హిందీ/ఇంగ్లీష్‌ సబ్జెక్టు పాఠ్యాంశంగా ఉండాలి. దీంతోపాటు ట్రాన్స్‌లేషన్‌(హిందీ/ఇంగ్లీష్‌) డిప్లొమా/సర్టిఫికెట్‌ కోర్సు చేసి ఉండాలి. లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థలో రెండేళ్ల ట్రాన్స్‌లేషన్‌ అనుభవం ఉండాలి. సీనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌ పోస్టులకు సంబంధిత విభాగంలో మాస్టర్‌ డిగ్రీతోపాటు మూడేళ్ల ట్రాన్స్‌లేషన్‌ అనుభవం ఉండాలి. బ్యాచిలర్‌ డిగ్రీ/పీజీ(హిందీ/ఇంగ్లీష్‌) అర్హతతోపాటు తగిన అనుభవం ఉండాలి. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో సీనియర్‌ సెకండరీ స్థాయిలో రెండేళ్ల హిందీ బోధన అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

జీతభత్యాలు: నెలకు జేటీ/జేహెచ్‌టీ పోస్టులకు రూ.35,400- రూ.1,12,400; ఎస్‌హెచ్‌టీ పోస్టులకు రూ.44,900- రూ.1,42,400 వరకు చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా

ఎంపిక: రాత పరీక్ష(పేపర్‌-1, పేపర్‌-2), డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, వైద్య పరీక్షల ద్వారా

దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌-సర్వీ్‌సమన్‌ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 12

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(పేపర్‌-1): 2023 అక్టోబరు

వెబ్‌సైట్‌: https://ssc.nic.in/

Updated Date - 2023-08-24T16:05:47+05:30 IST