Jobs: చిత్తూరు జిల్లాలో మెడికల్ పోస్టులు.. రేపే లాస్ట్ డేట్
ABN , First Publish Date - 2023-09-29T12:27:04+05:30 IST
చిత్తూరు జిల్లాలోని జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒప్పంద/అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన కింద పేర్కొన్న మెడికల్, పారా మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
చిత్తూరు జిల్లాలోని జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒప్పంద/అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన కింద పేర్కొన్న మెడికల్, పారా మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 54
1. మెడికల్ ఆఫీసర్: 11 పోస్టులు
2. స్టాఫ్ నర్స్: 31 పోస్టులు
3. ఫిజియోథెరపిస్ట్: 1 పోస్టు
4. మల్టీ-రిహాబిలిటేషన్ వర్కర్: 3 పోస్టులు
5. ల్యాబ్ టెక్నీషియన్: 4 పోస్టులు
6. ఫార్మసిస్ట్: 2 పోస్టులు. 7. లాస్ట్ గ్రేడ్ సర్వీస్: 1 పోస్టు
8. డేటా మేనేజర్: 1 పోస్టు
అర్హతలు: పోస్టును అనుసరించి పదోతరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 42 సంవత్సరాలకు మించకూడదు
ఎంపిక విధానం: విద్యార్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్ దరఖాస్తులు, సంబంధిత ధ్రువపత్రాలను జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, చిత్తూరు, చిత్తూరు జిల్లా చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబరు 30
వెబ్‌సైట్: https://chittoor.ap.gov.in/