EPFO: 81 వేలకు పైగా జీతంతో పోస్టులు.. ఖాళీలు ఎన్నంటే..!

ABN , First Publish Date - 2023-03-29T13:23:28+05:30 IST

న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌... రెగ్యులర్‌ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది

EPFO: 81 వేలకు పైగా జీతంతో పోస్టులు.. ఖాళీలు ఎన్నంటే..!
EPFO

న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌... రెగ్యులర్‌ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు: స్టెనోగ్రాఫర్‌(గ్రూ‌ప్-సి)

కేటగిరీ వారీగా ఖాళీలు: ఎస్సీలకు 28, ఎస్టీలకు 14, ఓబీసీ(ఎన్‌సీఎల్‌)లకు 50, ఈడబ్ల్యూఎస్‌లకు 19, అన్‌రిజర్వ్‌డ్‌కు 74

అర్హత: పన్నెండో తరగతి ఉత్తీర్ణతతోపాటు స్టెనోగ్రఫీ నైపుణ్యం ఉండాలి.

వయోపరిమితి: దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10 -15 ఏళ్లు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌లకు 3-8 ఏళ్ల సడలింపు ఉంటుంది.

జీతభత్యాలు: నెలకు రూ.25,500-రూ.81,100

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామినేషన్‌, స్టెనోగ్రఫీ స్కిల్‌ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష విధానం: ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్‌ విధానంలో 200 ప్రశ్నలకు ఉంటుంది. 800 మార్కులు కేటాయించారు. పరీక్ష సమయం 130 నిమిషాలు. జనరల్‌ ఆప్టిట్యూడ్‌(50 ప్రశ్నలు), జనరల్‌ అవేర్‌నెస్(కంప్యూటర్‌ అవేర్‌నెస్‌ సహా 50 ప్రశ్నలు), ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌(100 ప్రశ్నలు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నకు 4 మార్కులు ఉంటాయి.

దరఖాస్తు రుసుము: రూ.700. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌-సర్వీ్‌సమన్‌, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌: మార్చి 27 నుంచి ఏప్రిల్‌ 24

వెబ్‌సైట్‌: https://www.epfindia.gov.in/ site_en/Recruitments.php

Updated Date - 2023-03-29T13:23:28+05:30 IST