Jobs: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పోస్టులు.. అర్హతలు ఇవే..!
ABN , First Publish Date - 2023-07-14T12:14:41+05:30 IST
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నిపథ్ స్కీంలో భాగంగా అగ్నివీర్ వాయు నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నిపథ్ స్కీంలో భాగంగా అగ్నివీర్ వాయు నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు వివరాలు: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్- అగ్నిపథ్ స్కీం కింద అగ్నివీర్ వాయు(01/2024) బ్యాచ్ నియామకం
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మేథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్(10+2)/ఇంటర్మీడియట్(సైన్స్ కాకుండా ఇతర సబ్జెక్టులు)/ఇంటర్ ఒకేషనల్. లేదా మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా(మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలకా్ట్రనిక్స్/ఆటోమొబైల్/కంప్యూటర్ సైన్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఉత్తీర్ణత. నిర్దిష్ట శారీరక దారుఢ్య/వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 2003 జూలై 27 నుంచి 2006 డిసెంబరు 27 మధ్య జన్మించి ఉండాలి.
ఎత్తు: పురుషులు 152.5 సెం.మీ.; మహిళలు 152 సెం.మీ. ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఫేజ్-1(ఆన్‌లైన్ రాత పరీక్ష), ఫేజ్-2(ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2), ఫేజ్-3(మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్), ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
పరీక్ష ఫీజు: రూ.250
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: జూలై 27
చివరి తేదీ: ఆగస్టు 17
ఆన్‌లైన్ పరీక్షలు ప్రారంభం: అక్టోబరు 13
వెబ్‌సైట్: https://agnipathvayu.cdac.in/AV/