Taylor School: అల్లూరి, యల్లాప్రగడ, బాపు, కృష్ణంరాజు చదివింది ఇక్కడే.. కానీ ఇప్పుడిలా..!
ABN , First Publish Date - 2023-06-29T12:43:06+05:30 IST
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని టేలర్ హైస్కూల్ పేరు వింటే.. 170 ఏళ్ల చరిత్ర కళ్లముందు కదలాడుతుంది. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు, టెట్రాసైక్లిన ఇంజక్షన కనిపెట్టిన యల్లాప్రగడ, దర్శకుడు బాపు, రెబల్‌స్టార్ కృష్ణంరాజు వంటి మహానీయులు చదువుకున్నది ఇక్కడే. ఈ పాఠశాలకు సుమారు రూ.150 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి.
టేలర్ చరిత్రకు.. సెలవిక!
ప్రభుత్వ ఆధీనంలోకి నరసాపురం టేలర్ హైస్కూల్
170 ఏళ్ల చరిత్ర.. 150 కోట్లపైనే ఆస్తులు
అల్లూరి సీతారామరాజు, యల్లాప్రగడ, బాపు, కృష్ణంరాజు చదివింది ఇక్కడే
నరసాపురం, జూన 28: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని టేలర్ హైస్కూల్ పేరు వింటే.. 170 ఏళ్ల చరిత్ర కళ్లముందు కదలాడుతుంది. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు, టెట్రాసైక్లిన ఇంజక్షన కనిపెట్టిన యల్లాప్రగడ, దర్శకుడు బాపు, రెబల్‌స్టార్ కృష్ణంరాజు వంటి మహానీయులు చదువుకున్నది ఇక్కడే. ఈ పాఠశాలకు సుమారు రూ.150 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఎయిడెడ్ ప్రైవేటు పాఠశాలగా ఉన్న ఈ హైస్కూలు బుధవారం నుంచి ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లిపోయింది. ప్రస్తుత కరస్పాండెంట్ పోతుల జగన ఈ విద్యా సంస్థను ప్రభుత్వానికి అప్పగిస్తూ.. సంబంధింత పత్రాలను జిల్లా అధికారులకు అందజేశారు. ‘స్కూల్‌కు ఆదరణ తగ్గడం, ఇంగ్లీష్ మీడియంకు అనుమతి ఇవ్వకపోవడం, సిబ్బంది కొరత తదితర కారణాలతో స్కూల్ మూతపడే పరిస్థితి వచ్చింది. ఇలాంటి స్థితి రాకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వానికి అప్పగిస్తున్నాం’ అని పోతుల జగన తెలిపారు.