Neet: మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌

ABN , First Publish Date - 2023-03-16T16:55:07+05:30 IST

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (National Testing Agency) (ఎన్‌టీఏ) - అండర్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ కోర్సుల్లో (Medical course) ప్రవేశానికి ఉద్దేశించిన నేషనల్‌ ఎలిజిబిలిటీ కం ఎంట్రెన్స్‌ టెస్ట్‌(నీట్‌) యూజీ 2023 నోటిఫికేషన్‌ను (Notification) విడుదల

Neet: మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌
నోటిఫికేషన్‌

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (National Testing Agency) (ఎన్‌టీఏ) - అండర్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ కోర్సుల్లో (Medical course) ప్రవేశానికి ఉద్దేశించిన నేషనల్‌ ఎలిజిబిలిటీ కం ఎంట్రెన్స్‌ టెస్ట్‌(నీట్‌) యూజీ 2023 నోటిఫికేషన్‌ను (Notification) విడుదల చేసింది. ఈ ఎగ్జామ్‌లో సాధించిన ర్యాంక్‌ ఆధారంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఏఎంఎస్‌, బీఎస్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో అడ్మిషన్స్‌ ఇస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ/ ప్రైవేట్‌/అనుబంధ మెడికల్‌/డెంటల్‌/ ఆయుష్‌ కళాశాలలు; డీమ్డ్‌ యూనివర్సిటీలు; ఎయిమ్స్‌, జిప్మర్‌ ఇన్‌స్టిట్యూషన్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఆలిండియా కోటా కింద 15 శాతం సీట్లు ప్రత్యేకించారు.

అర్హత వివరాలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంగ్లీష్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ/బయోటెక్నాలజీ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్‌/ పన్నెండోతరగతి/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి. విదేశీ విద్యార్థులు మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ఎంసీఐ) నిబంధనల మేరకు అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ యూనివర్సిటీస్(ఏఐయూ) నుంచి ఈక్వివేలెన్స్‌ సర్టిఫికెట్‌ను సబ్మిట్‌ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు 2006 డిసెంబరు 31 లోపు జన్మించి ఉండాలి.

నీట్‌ యూజీ 2023 వివరాలు: ఈ పరీక్షని ఇంగ్లీష్‌, తెలుగు, ఉర్దూ సహా హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, ఓడియా, పంజాబీ, గుజరాతీ, బెంగాలీ, అస్సామీ భాషల్లో నిర్వహిస్తారు. వీటిలో ఒకదాన్ని అభ్యర్థులు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లీ్‌్‌షను ఎంచుకొంటే ఆంగ్ల భాషలో మాత్రమే ప్రశ్నపత్రాన్ని ఇస్తారు. మిగిలినవాటికైతే ఎంచుకొన్న లాంగ్వేజ్‌తోపాటు ఇంగ్లీ్‌షలో కూడా ప్రశ్నలు ఉంటాయి. ఈ ఎగ్జామ్‌లో మొత్తం 200 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల నుంచి ఒక్కోదానిలో 50 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సబ్జెక్టులో రెండు సెక్షన్‌లు ఉంటాయి. మొదటి సెక్షన్‌లో 35 ప్రశ్నలు ఇస్తారు. వీటన్నింటికి సమాధానాలు గుర్తించాలి. రెండో సెక్షన్‌లో 15 ప్రశ్నలు ఇస్తారు. వీటిలో ఏవైనా పదింటికి సమాధానాలు గుర్తించాలి. పది కంటే ఎక్కువ ప్రశ్నలకు ఆన్సర్‌ గుర్తిస్తే మొదటి పది సమాధానాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. అభ్యర్థులు సమాధానాలను బాల్‌ పాయింట్‌ పెన్‌తో ఓఎంఆర్‌ పత్రం మీద గుర్తించాలి. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు నిర్దేశించారు. మొత్తం మార్కులు 720. సమాధానాన్ని తప్పుగా గుర్తిస్తే ఒక మార్కు కోత విధిస్తారు. పరీక్ష సమయం మూడు గంటల ఇరవై నిమిషాలు.

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.1700; ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.1600; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1000; విదేశీ అభ్యర్థులకు రూ.9,500

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 6

నీట్‌ యూజీ తేదీ: మే 7

వెబ్‌సైట్‌: neet.nta.nic.in

Updated Date - 2023-03-16T16:55:07+05:30 IST